జిమ్‌లో తమిళనాడు సీఎం స్టాలిన్ వర్క్అవుట్లు జిమ్‌లో కసరత్తులు చేస్తూ కనిపించారు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. బిజీ షెడ్యూల్లోనూ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తున్న స్టాలిన్.. వీకెండ్లో తన వ్యక్తిగత జిమ్‌లో వర్క్అవుట్లు చేశారు.
68ఏళ్ల స్టాలిన్ జిమ్‌లో వ్యాయామం చేస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
వర్క్అవుట్లు చేస్తున్న స్టాలిన్ సైక్లింగ్ కూడా..
వ్యాయామం పట్ల స్టాలిన్‌కు ఉన్న శ్రద్ధ అందరికి తెలిసిన విషయమే. గతంలోనూ అనేక సార్లు రోడ్లపై సైక్లింగ్ చేస్తూ కనిపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఆ అలవాట్లను మానుకోలేదు స్టాలిన్. చెన్నై ఈసీఆర్ ప్రాంతంలో సైకిల్‌పై చక్కర్లుకొట్టి అక్కడి వారిని ఆశ్చర్యపరిచారు.
ఇదీ చూడండి:సీఎం కీలక నిర్ణయం- పూజారులుగా బ్రాహ్మణేతరులు