తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వైరల్ వీడియో - వంట గదిలో కింగ్‌ కోబ్రా - పడగ విప్పిన పామును చేత్తో పట్టుకొని! - snake catching viral videos instagram

Viral Video Snake At Home : పామును దూరం నుంచి చూస్తేనే.. పారిపోతుంటారు చాలా మంది. కానీ.. కొద్ది మంది మాత్రమే వాటిని ధైర్యంగా పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తి.. ఏకంగా కింగ్ కోబ్రాను చేత్తో పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

snake catching at home viral video
snake catching at home viral video

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 5:04 PM IST

Viral Video Snake At Home : "నీ వెనకాల పాము" అని జోక్ చేసినా.. హడలెత్తిపోతారు చాలా మంది. దానితో ఉన్న ప్రమాదం అలాంటిది మరి. పొరపాటున కాటు పడిందంటే.. ప్రాణాల మీదకే వచ్చేస్తుంది. అందుకే.. పాము పేరెత్తగానే వణికిపోతారు. అయితే.. అటవీ ప్రాంతాలకు, చెట్ల పొదలు దగ్గరగా ఉన్న ఇళ్లలోకి పాములు వస్తుంటాయి. ఎక్కువ శాతం ఆహారాన్ని వెతుక్కుంటూ వచ్చి.. దారితప్పి ఇళ్లలో చిక్కుకుపోతాయి.

ఇలాంటి సమయంలో పాములను చూసిన వారు.. భయంతో చంపేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. స్నేక్ క్యాచర్స్​ను పిలిపిస్తే.. వారు సురక్షితంగా పట్టేస్తారు. ఇదేవిధంగా.. వంటింట్లో దూరిన ఓ పామును చేత్తో పట్టేశాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పామును పట్టిన వీడియో చూస్తే గూస్‌బంప్స్‌ రావడం ఖాయం.

సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోను.. శ్యామ్ గోవింద్‌సర్ అనే స్నేక్ క్యాచర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​లో పోస్ట్‌ చేశాడు. ఓ ఇంట్లో ట్రంక్‌ పెట్టె చాటున దాక్కున్న కింగ్ కోబ్రాను చూసి.. ఆ ఇంట్లోని వారు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే.. స్నేక్ క్యాచర్ శ్యామ్ కు ఫోన్ చేశారు. రంగంలోకి దిగిన శ్యామ్ గోవింద్ సర్.. చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నాడు.

సోషల్ మీడియాలో పోస్టుచేసిన ఈ వీడియో వైరల్ అయ్యింది. ఇప్పటివరకు 32 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసినవారు వేలాదిగా కామెంట్స్ చేస్తున్నారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి పామును ఒడిసి పట్టిన తీరుకు.. ఆ యువకుడిని నెటిజన్లు అభినందిస్తున్నారు. "పాములను సులభంగా పట్టడంలో నీకు నీవే సాటి సోదరా.." అని ఒకరు కామెంట్ చేశారు. "జాగ్రత్తగా ఉండండి సోదరా.." అంటూ మరొకరు సూచించారు.

తాను జంతు ప్రేమికుడినని.. వాటిని సంరక్షించేందుకే పని చేస్తున్నానని.. శ్యామ్‌ గోవింద్‌సర్‌ (Shyam Govindsar) తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో రాసుకున్నారు. అంతేకాదు.. 'మా కర్ణి రెస్క్యూ సర్వీస్ ఆర్గనైజేషన్ గోవింద్సార్' అనే పేరుతో ఒక ఆర్గనైజేషనే నడుపుతున్నాడు. పాములు, వన్యప్రాణులను కాపాడుతూ.. సురక్షిత ప్రాంతాల్లో వదిలి పెడుతున్నట్టు చెప్పాడు శ్యామ్.

ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో.. తాను రక్షించిన పాములకు సంబంధించిన వీడియోలను పోస్ట్‌ చేస్తున్నాడు. అతను పాములను రక్షించిన వీడియోలకు లక్షలాదిగా వ్యూస్ వచ్చాయి. అవసరమైన వారికి అందుబాటులో ఉంటానని ప్రకటించిన శ్యామ్‌ గోవింద్‌సర్‌.. తన అకౌంట్ బయోలో ఫోన్ నెంబర్‌ కూడా రాసుకున్నాడు. ఎవరికి అవసరం వచ్చినా.. కాల్ చేయాలని, వెంటనే వాలిపోతానని చెబుతున్నాడు. అన్నట్టూ.. శ్యామ్‌ గోవింద్‌సర్‌ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. దాదాపు 41 వేల సబ్‌ స్క్రైబర్లు ఉన్నారు.

Viral Video : పాముకు ఊపిరి ఊది.. బతికించిన పోలీస్..! వీడియో వైరల్

Man Puts Poisonous Snake In to Mouth Viral Video : వీడెవడండీ బాబూ.. పాము మెడలో వేసుకొని.. తల నోట్లో పెట్టుకొని..

ABOUT THE AUTHOR

...view details