ఇది దేశ రాజధాని దిల్లీ శివారులోని గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులందరూ విగతజీవుల్లా మారారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. మొత్తం ఎనిమిది మంది ప్రాణవాయువు అందక ప్రాణాలువదిలారు. చనిపోయిన తమ వారిని చూసి వారి బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దాదాపు వారంక్రితం అంటే శుక్రవారం జరిగిన ఈ ఘోరానికి సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
నిండుకున్న నిల్వలు..
గురుగ్రామ్‌లోని క్రితి అనే ప్రైవేటు ఆస్పత్రిలో ఆరుగురు కరోనా రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వారందరూ కృత్రిమశ్వాసపై ఉన్నారు. ఆస్పత్రిలో ప్రాణవాయువు నిల్వలు నిండుకోవటంతో.. వారిప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఒకేసారి ఆరుగురి శ్వాస ఆగిపోవటంతో.. వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది ప్రమాదాన్ని పసిగట్టారు. రోగుల బంధువులు వచ్చేలోగానే ఐసీయూకి తాళం వేసి అక్కడి నుంచి జారుకున్నారు.
తమవారిని చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన బంధువులు.. భయంకరమైన నిశ్శబ్ద వాతావరణం చూసి ఆందోళన చెందారు. ఐసీయూకి తాళం చూసి వారి గుండె వేగం మరింత పెరిగింది. భయం భయంగా వెళ్లి.. ఐసీయకి వేసిన తాళంతీశారు. ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోయిన తమ వారిని చూసి గుండెలు బాదుకున్నారు.
పారిపోయిన వైద్యులు..
బాధితుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు ఆస్పత్రికి చేరుకోవటంతో.. అప్పటివరకూ కనిపించకుండాపోయిన వైద్యులు, ఇతరసిబ్బంది ప్రత్యక్షమయ్యారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమవారు చనిపోయినట్లు బంధువులు ఆరోపించారు. అయితే.. ఐసీయూ వద్ద వైద్యులు, ఇతర సిబ్బంది లేకపోవటాన్ని ఆస్పత్రి యాజమాన్యం సమర్థించుకుంది. వారంతా ఎక్కడికి వెళ్లలేదని, దాడిచేస్తారన్న భయంతో.. ఆస్పత్రి ఆవరణలోని క్యాంటిన్లో దాక్కున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గతనెల 24న రోగుల బంధువులు కొందరు దాడిచేసిన నేపథ్యంలో.. ఐసీయూ నుంచి వెళ్లిపోవాలని వైద్యులు, ఇతర సిబ్బందికి తామే సూచించినట్లు పేర్కొన్నారు.
సమాచారమిచ్చినప్పటికీ..