తెలంగాణ

telangana

Viral Video Four Year Old Boy Rides Royal Enfield : వయసు నాలుగేళ్లు.. రాయల్ ఎన్​ఫీల్డ్​తో రౌండ్లేస్తున్నాడు!

Viral Video Four Year Old Boy Rides Royal Enfield : నాలుగేళ్ల వయసులో సహజంగా పిల్లలు ఏం చేస్తుంటారు..? చిన్నపాటి సైకిల్​తో కుస్తీ పడుతుంటారు. కానీ.. ఇక్కడో వెరీ టాలెంటెడ్ బుడ్డుడో ఉన్నాడు. ఏకంగా.. రాయల్ ఎన్​ఫీల్డ్​ బైక్​తో జల్సా చేస్తున్నాడు! మరి, ఆ సంగతేంటో మీరూ చూసేయండి.

By ETV Bharat Telugu Team

Published : Oct 12, 2023, 3:42 PM IST

Published : Oct 12, 2023, 3:42 PM IST

Viral Video Four Year Old Boy Rides Royal Enfield
Viral Video Four Year Old Boy Rides Royal Enfield

Viral Video Four Year Old Boy Rides Royal Enfield : సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత.. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వెంటనే అందరికీ తెలిసిపోతోంది. ఈ క్రమంలో కొందరు చిన్నారుల పే..ద్ద టాలెంట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటివి చూస్తున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వయసుకు మించి బుడతలు ప్రదర్శించే టాలెంట్​కు మంత్రముగ్ధులు అవుతున్నారు. అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం నాలుగేళ్ల చిన్నారి.. ఏకంగా రాయల్ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ను నడిపి, ఔరా అనిపించాడు!

Kerala Four Year Old Boy Rides Royal Enfield and RX100 Bikes :ఈ చిన్నారి ఎక్కడో బయటి ప్రాంతానికి చెందినవాడు కాదు. మన వాడే. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ చిచ్చరపిడుగు.. తన అసాధారణమైన మోటార్‌సైకిల్ రైడింగ్ నైపుణ్యంతో ఓవర్​ నైట్​ స్టార్​గా మారిపోయాడు. నాలుగేళ్ల పిల్లాడు సైకిల్ తొక్కేందుకు నానాపాట్లు పడుతుంటాడు. పడుతూ.. లేస్తూ.. కాళ్లకు దెబ్బలు తగిలించుకుంటూ.. సైకిల్ నేర్చుకోవడం వంటివి చేసే వయసు అది! కానీ.. ఈ బుడ్డోడు ఏకంగా రాయల్ ఎన్​ఫీల్డ్​ 350 మోడల్​ను నడిపేశాడు.

Viral Video : వారెవ్వా.. ఏం టాలెంట్​రా బుడ్డోడా..! నెట్టింట వీడియో వైరల్..!

"tranz__moto_hub" అనే ఇన్​స్టా గ్రామ్​ అకౌంట్​లో ఈ వీడియోలు పోస్టు చేశారు. ఇందులో ఈ చిన్నారి చేస్తున్న అద్భుతమైన విన్యాసాలను అతని తండ్రి పోస్టు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. ఈ సూపర్ టాలెంట్ చిన్నారి పేరు మాత్రం తెలియలేదు. ఈ వీడియోలో అతని తండ్రి కాస్త హెల్ప్ చేస్తూ కనిపించాడు. ఆ తర్వాత ఇక "ఆగేదే లే" అన్నట్టుగా దూసుకెళ్లిపోయాడు ఆ బుడ్డోడు. రౌండ్ల మీద రౌండ్ల వేశాడు.

Man Puts Poisonous Snake In to Mouth Viral Video : వీడెవడండీ బాబూ.. పాము మెడలో వేసుకొని.. తల నోట్లో పెట్టుకొని..

ఆ చిన్నోడికి బైక్ నేర్పించడానికి అతని తండ్రి ఎంచుకున్న చోటు కూడా చాలా చక్కగా ఉంది. సువిశాలమైన మైదానం కావడంతో.. ఎలాంటి ఇబ్బందీ లేకుండా వాహనాలను నడపం తేలికైంది. అయితే.. ఆ బాలుడు కేవలం రాయల్ ఎన్​ఫీల్డ్ మాత్రమే కాదు.. యమహా RX100ను కూడా నడిపాడు. అంతేనా..? ఇంకా వివిధ మోటార్‌ సైకిళ్లను రయ్య్య్​మనిపించాడు. ఎలాంటి బెరుకూ లేకుండా.. ఆ చిన్నారి వాహనాలను నడిపిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నరు.

ఈ వీడియోను షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలకం.. ఆ చిన్నారి వెన్నుతట్టి తండ్రి ప్రోత్సహిస్తున్న తీరు ఎంతో బాగుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పట్నుంచే ఇలా బైక్​లు నడిపితే.. పెద్దయ్యాక రేసర్ ఖచ్చితంగా అవుతాడు అంటూ మరొకరు అభిప్రాయపడ్డారు. రన్.. రన్.. బైకులతో మొదలు పెట్టి.. విమానాల దాకా దూసుకెళ్లాలి చిన్నోడా.. అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి తనదైన రైడింగ్​తో చిన్నోడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.

Viral Video Father and Daughter Duo Cute Dance : కూతురుతో కలిసి తండ్రి డ్యాన్స్​.. క్యూట్​ ఎక్స్​ప్రెషన్​కు నెటిజన్లు ఫిదా!

Viral Video Woman Innovation : టూత్​పేస్ట్​ డబ్బాతో.. వాటర్ ట్యాప్​ నోరు మూసేసిందిగా..! హర్ష గోయెంకా ఫన్నీ కామెంట్​

ABOUT THE AUTHOR

...view details