తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమ్మను అనుసరిస్తూ.. సరైన దారిలో పయనిస్తూ.. - అమ్మను అనుసరిస్తున్న సింహం పిల్లలు

సింహాన్ని దాని పిల్లలు అనుసరిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అమ్మను అనుసరిస్తే పెడదారిన పట్టబోమనే క్యాప్షన్​ను జోడించి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్​లో పనిచేస్తున్న సుశాంత నంద షేర్ చేసిన ఈ వీడియోకు నెటిజన్లు భారీగా స్పందించారు.

lion cubs
సింహం పిల్లలు

By

Published : May 15, 2021, 4:08 PM IST

Updated : May 15, 2021, 4:32 PM IST

పుట్టింది మొదలు అమ్మ అడుగుజాడల్లోనే నడుస్తుంటాం. ప్రతి అవసరంలోనూ అమ్మే మార్గనిర్దేశం చేస్తుంది. కొన్ని విషయాల్లో అమ్మను గుడ్డిగా అనుసరిస్తాం. అమ్మతనం అన్ని జీవుల్లోనూ ఒకే తీరు కదూ! ఇదే సందేశాన్ని ఓ సింహాన్ని అనుసరిస్తున్న దాని పిల్లలు తెలుపుతున్నాయని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో పనిచేస్తున్న సుశాంత నంద అంటున్నారు. ట్విట్టర్​లో షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో సింహాన్ని దాని పిల్లలు అనుసరిస్తున్నాయి. అమ్మను అనుసరిస్తే తప్పుడు దారుల్లో నడవబోమనే సందేశాన్ని వీడియోకు సుసాంట నంద యాడ్ చేశారు. ముద్దులొలికే ఆ పిల్లలు సింహాన్ని అనుసరించే సన్నివేశం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీంతో వారు భారీగా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రకృతిలో ప్రతి జీవి నుంచి నేర్చుకోవచ్చని కామెంట్ రూపంలో చెబుతున్నారు.

Last Updated : May 15, 2021, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details