తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకేసారి 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ భద్రత'! - భాజపా నేతలకు భద్రత

VIP Security For BJP Leaders: అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్​లోని దాదాపు 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ కేటగిరీ' భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వీరితో పాటు కేంద్ర మంత్రి ఎస్​పీఎస్ బఘేల్​కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు.

VIP Security For BJP Leaders
భాజపా నేతలకు వీఐపీ కేటగిరీ భద్రత

By

Published : Feb 16, 2022, 4:41 PM IST

VIP Security For BJP Leaders: ఎన్నికల నేపథ్యంలో పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్​లోని దాదాపు 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ కేటగిరీ' భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్​పై పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్​పీఎస్ బఘేల్​కు జెడ్​ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు.

బఘేల్​తోపాటు భాజపా ఎంపీ, సింగర్ హన్స్ రాజ్ హన్స్​కు కూడా జెడ్​ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం. ఇక ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన భాజపా ఎంపీ రమేశ్ చంద్​ బింద్​కు ఎక్స్​ కేటగిరీ భద్రతను కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. వీరికి భద్రతగా సీఆర్​పీఎఫ్, సీఐఎస్​ఎఫ్​ బలగాలను కేంద్రం పంపినట్లు తెలిపారు. వీరిలో కొద్దిమంది నేతలకు మాత్రం ఎన్నికల కార్యక్రమాలు అయ్యేంతవరకు 'వీఐపీ కేటగిరీ' భద్రతను కేంద్రం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

బఘేల్​ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్​పై కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. మెయిన్​పురి జిల్లాలో బఘేల్ కాన్వాయ్​పై ఎస్​పీకి చెందిన దుండగులు దాడికి దిగారని భాజపా నేతలు మంగళవారం ఆరోపణలు చేశారు.

ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనీసం 20 మంది నేతలకు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సీఆర్​పీఎఫ్​కు సూచనలు చేసింది. భద్రతను కొనసాగించడంపై మార్చి 10 ఓట్ల లెక్కింపు తర్వాత కేంద్రం సమీక్షిస్తుందని అధికారులు తెలిపారు.

పంజాబ్​లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా.. ఉత్తర్​ప్రదేశ్​లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే యూపీలో రెండు దశలు పూర్తికాగా.. మూడోదశ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనున్నాయి.

ఇవీ చూడండి:

'ఈ ఎన్నికల్లో ప్రయోగాలు వద్దు'.. పంజాబ్​ ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి

నినాదాలే బ్రహ్మాస్త్రాలు- ఎన్నికల్లో గెలిపిస్తాయా?

'కాంగ్రెస్​కు ఆప్ ఫొటోకాపీ​.. పంజాబ్​ మాకు చాలా ముఖ్యం'

ABOUT THE AUTHOR

...view details