Vinayaka Chavithi 2023 Second Day Pooja and Prasadam :లంబోదరుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశమంతటా స్వామి వారు తీరొక్క రూపంలో అందంగా అలంకరించిన మండపాల్లో ఆసీనులయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా.. మొదటి రోజైన భాద్రపద శుద్ధ చవితి నాడు.. విఘ్నేశ్వరుడిని "వరసిద్ధి వినాయకుడు" అంటారు. ఆ పేరుతోనే పూజిస్తారు. తొలి రోజున గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్లు సమర్పిస్తారు. మరి రెండో రోజు స్వామి వారిని ఏ పేరుతో పిలుస్తారు.. దేనిని నైవేద్యంగా సమర్పిస్తారో ఈ కథనంలో తెలుసుకుందాం..
Ganesh Chaturthi Second Name and Prasadam:నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అంటే.. భాధ్రపద శుద్ధ పంచమి నాడు ఆ గణపతిని వికట వినాయకుడు అని పిలుస్తారు. ‘లంబోదరశ్చ వికటో’ అని స్మరిస్తాం. స్వామిని వికట వినాయకునిగా ఆవాహన చేసి, మొదటిరోజున పూజించినట్లే పూజించాలి.
ఈ రోజున చదువుకోవాల్సిన కథాంశం.. పరమశివుడి కోపానికి గురైన మన్మథుడు అగ్నికి ఆహుతి అవుతాడు. అలా కాముణ్ని భస్మం చేయగా మిగిలిన రుద్రనేత్రాగ్ని సముద్రంలో పడింది. ఆ అగ్ని నుంచి పుట్టినవాడే జలంధరుడు. శివుడి వల్ల తప్ప వేరొకరి చేత అతనికి మరణం లేదని బ్రహ్మదేవుడు చెప్పాడు. కాలనేమి అనేవాడు తన పుత్రిక బృందను జలంధరునికి ఇచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడు కామాసురుడు.. మహిషాసురుని కుమార్తె తృష్ణను పరిణయం చేసుకుంటాడు. ఆ అసురుడు.. శివుడి కోసం భీకరమైన తపస్సు చేస్తాడు. అజేయత్వం, నిర్భయత్వం, మృత్యుంజయత్వమనే వరాలను పొందుతాడు. మూషికాసురునికి ఆత్మీయుడై విజృంభించ సాగాడు. అలా లోకమంతా కామాధీనమయింది.
దేవతలు, మునులు ముద్గల మహర్షిని ఆశ్రయించి, ఆయన సూచనమేరకు వికట వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆయన నుంచి అభయం పొందారు. అంతే కాకుండా తాను చెరబట్టిన చిత్రాంగిని రక్షించాడని మూషికాసురుడు.. గణపతిపై అప్పటికే కక్షగట్టి ఉన్నాడు. అందువల్ల మూషికాసురుడు తన విరోధి వినాయకుడి మీదికి కామాసురుని పురిగొల్పాడు. కామాసురుడు మయూర రూపం ధరించి, లోకమంతటినీ కామంతో ప్రభావితం చేస్తూ… గణపతిని కూడా లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. గణపతి ఆ మయూరాన్ని అణచివేసి దానిని అధిరోహించాడు. నెమలిపై విహరిస్తున్న స్వామిని చూసి దేవతలు, మునులు, ‘మయూరవాహనా! వికట వినాయకా!’ అని స్తుతించారు. అటుకులు నివేదించి స్వామిని తృప్తి పరిచారు. రెండోనాటి పూజ ద్వారా సమాజం.. దుష్ట కామాన్ని వీడాలి.
మరి రెండో రోజున స్వామి వారికి అటుకులతో చేసిన పాయసాన్ని నివేదించండి. మరి అటుకుల పాయసం ఎలా చేయాలి..? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు:
- అటుకులు: కప్పు
- చిక్కటి పాలు: లీటరు
- బాదం: పది
- పిస్తా: పది
- యాలకులపొడి: చిటికెడు
- నెయ్యి: టేబుల్‌స్పూను
- పంచదార: కప్పు
- జీడిపప్పు: నాలుగు
- ఎండుద్రాక్ష: 15