తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనుమానాస్పదంగా జింకల కళేబరాలు.. సోలార్​ కంపెనీ పనేనా? - జింకలు కళేబరాలు

రాజస్థాన్​లోని ఈడెన్​ సోలార్​ కంపెనీ ఆవరణలో గత కొద్ది రోజులుగా జింకల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు.. ఆ సోలార్​ కంపెనీ ఉద్యోగులే వాటిని పొట్టనపెట్టుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అసలేం జరిగింది?

Deer carcasses
Deer carcasses

By

Published : Jun 24, 2022, 11:25 AM IST

రాజస్థాన్​లోని జైసల్మేర్​లో అనుమానస్పదంగా జింకల కళేబరాలు కనిపించాయి. ఈడెన్​ సోలార్​ ప్లాంట్​ పరిసర ప్రాంతాల్లో కేవలం రెండు రోజుల్లోనే 13 జింకల మృతదేహాలు బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. సోలార్​ కంపెనీ ఉద్యోగులే వాటిని చంపేస్తున్నారని ఆరోపించారు. తనిఖీకి వచ్చిన ఎన్​జీఓ అధికారుల బృందం.. కంపెనీపై కేసు నమోదు చేసింది.

అసలేం జరిగిందంటే?..జైసల్మేర్​లోని ఈడెన్​ సోలార్​ కంపెనీ ఆవరణలో గత కొద్దిరోజులుగా జింకల కళేబరాలు కనిపిస్తున్నాయి. కేవలం రెండురోజుల్లో సుమారు 13 జింకల కళేబరాలు కనిపించాయి. వెంటనే స్పందించిన​ గ్రామస్థులు జంతు సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎన్​జీఓ జంతు సంరక్షణ కమిటీ వరుసగా రెండు రోజులు తనిఖీలు నిర్వహించింది. గురువారం జరిపిన తనిఖీల్లో చనిపోయిన ఐదు జింకలను గుర్తించింది. అయితే ఎన్జీవోల బృందాన్ని సోలార్ కంపెనీ ఉద్యోగులు.. కంపెనీ లోపలకి వెళ్లేందుకు నిరాకరించారు. ఫొటోలు తీస్తున్నా కంపెనీ ఉద్యోగులు అడ్డుపడ్డారు. దీంతో సోలార్ కంపెనీపై కేసు నమోదు చేశారు ఎన్జీవోలు. చేసేదేమీ లేక కంపెనీ వెలుపల మాత్రమే తనిఖీలు నిర్వహించారు. అయితే స్థానికులు మాత్రం సోలార్​ కంపెనీ వాళ్లే జింకలు చంపేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details