రామాయణ గాథలో సీత తండ్రి జనకుని పాత్ర అందరికీ సుపరిచితమే. ఆ పురాణ చరిత్రలో జనకుడికి సంతానం కలగకపోతే ఆయన భార్య రత్నమాలతో కలసి ఓ యజ్ఞం నిర్వహిస్తాడు. ఆ తర్వాత భూమిని దున్నడం ద్వారా ఆ దంపతులు సీతను పొందుతారు. ఈ జనకుని కథ ఆధారంగానే ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లా సంగ్రాలి అనే గ్రామంలో ఓ సంప్రదాయం పుట్టుకొచ్చింది. రామయణ చరిత్రలోని జనకుని పాత్ర పోషిస్తే.. సంతానం కలుగుతుందని బలంగా విశ్వసిస్తున్నారు ఆ గ్రామ ప్రజలు. ఉద్యోగాలు కూడా వస్తాయని నమ్ముతున్నారు. ఇప్పటి వరకు 18 మందికి ఇలాగే పిల్లలు పుట్టారని చెబుతున్నారు సంగ్రాలి ప్రజలు.
"నాకు పెళ్లి అయ్యి చాలా కాలం అయింది. అయినా పిల్లలు కలగలేదు. రామాయణంలో జనకుని పాత్ర పోషించిన తరువాత నాకు కుమార్తె జన్మించింది. జనకుని వేషధారణతో కచ్చితంగా పిల్లలు పుడతారు."
-సంతోష్ సోమ్వాల్, మాజీ సైనికుడు