కర్ణాటక చామరాజనగర్లో హృదయవిదారక ఘటన జరిగింది. శ్మశానానికి వెళ్లే దారిలో కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల పంచాయతీ కార్యాలయం ఎదుటే చంద్రమ్మ(48) అనే మహిళ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు గ్రామస్థులు. దీంతో అధికారులు, గ్రామస్థుల మధ్య కాసేపు గందరగోళం నెలకొంది.
జిల్లాలోని మాంపల్లి గ్రామంలోని శ్మశాన వాటికకు వెళ్లాలంటే సువర్ణవతి రిజర్వాయర్ దాటాల్సి వస్తోంది. అధిక వర్షాల వల్ల అక్కడి కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
చంద్రమ్మ అనే మహిళ గురువారం మరణించగా.. శ్మశానానికి వెళ్లేందుకు వంతెన లేకపోవడం వల్ల అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. పదేళ్లుగా జిల్లా అధికార యంత్రాంగానికి, స్థానిక ఎమ్మెల్యేలకు గ్రామస్థులు ఎంత విన్నవించినా వంతెన నిర్మించలేదు. అందుకే మృతదేహాన్ని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించామని స్థానికులు తెలిపారు.
గ్రామపంచాయతీ కార్యాలయం ముందే అంత్యక్రియలు.. కారణం ఇదే! - సువర్ణవతి రిజర్వాయర్
గ్రామపంచాయతీ కార్యాలయం ముందే ఓ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు గ్రామస్థులు. కర్ణాటక చామరాజనగర్లో ఈ ఘటన జరిగింది. కారణం ఏంటంటే?
పంచాయతీ కార్యాలయం ఎదుటే మృతదేహాన్ని పూడ్చిపెట్టిన గ్రామస్థులు