తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదిపై వంతెన కట్టిన గ్రామస్థులు.. అధికారుల అలసత్వానికి 'శ్రమదానం'తో పరిష్కారం - ఓడిశా వెదురుబొెంగుల వంతెన

అధికారులను అడిగి అడిగి అలసిపోయిన గ్రామస్థులు.. చివరకు సొంతంగా నదిపై వంతెన ఏర్పాటు చేసుకున్నారు. ఒడిశా కొరాపుట్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

craft bridge
కట్టెల వంతెన

By

Published : Oct 28, 2022, 1:49 PM IST

నదిపై వెదురుబొంగుల వంతెన

ఒడిశా కొరాపుట్ జిల్లా దస్మంత్​పుర్ బ్లాక్​కు చెందిన నందిగాన్ గ్రామ పంచాయతీ ప్రజలు సొంత నిధులతో వంతెన ఏర్పాటు చేశారు. ఈ పంచాయతీ పరిధిలో ఉన్న నది రాక పోకలకు అవరోధంగా మారింది. దీని వంతెన నిర్మాణం చేపట్టాలని అధికారులకు స్థానికులు చాలా సార్లు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం 2017లో రూ.2.77 కోట్లు మంజూరు చేసింది. 2019లో నిర్మాణం పూర్తి కావలసి ఉండగా అధికారులు, కాంట్రాక్టర్ సమన్వయ లోపంతో గుంతలు తవ్వి వదిలేశారు. దీంతో చేసేదిలేక గ్రామస్థులే సొంతంగా వెదురుబొంగులు, చెక్కలతో నదిపై వంతెన ఏర్పాటు చేసుకున్నారు.

ఊరు దాటి వెళ్లేందుకు, వేరే వారు ఊళ్లోకి వచ్చేందుకు కష్టంగా ఉంది. ఆసుపత్రి వెళ్లలేకపోతున్నాం. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సైతం ఏడాదిలో నాలుగు నెలలు విధులకు రాలేకపోతున్నారు. అందుకే ఇలా వంతెన నిర్మంచుకున్నాం.

- గ్రామస్థులు

ABOUT THE AUTHOR

...view details