తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా రెండో ఉద్ధృతికి పల్లెలు విలవిల - పల్లెల్లో కరోనా కలకలం

కరోనా రెండో దశ వ్యాప్తితో పల్లెలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. పట్టణాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 1.39 రెట్లు అధికంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మే నెలలో తొలి 4 రోజుల గణాంకాల పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది.

corona
కరోనా రెండో ఉద్ధృతికి పల్లెలు విలవిల

By

Published : May 10, 2021, 7:08 AM IST

కరోనా మహమ్మారి తొలి ఉద్ధృతికి పట్టణ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమైతే రెండో ఉద్ధృతికి గ్రామీణ భారతం విలవిల్లాడుతోంది. మే నెలలో తొలి 4 రోజుల గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో 1.39 రెట్లు అధికంగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కేసుల్లో 34.5% పట్టణాల్లో, గ్రామీణ భారతంలో 48.1% నమోదయ్యాయి. మిగిలిన 17.4% కేసులు గ్రామీణ, పట్టణ జనాభా కలిసిన జిల్లాల్లో నమోదయ్యాయి.

అప్పుడు 5 నెలలు.. ఇప్పుడు 2 నెలలే..
కరోనా తొలి ఉద్ధృతిలో గ్రామీణ ప్రాంతాలు అంతగా ప్రభావితం కాలేదు. నిరుడు మార్చిలో కేసుల నమోదు ప్రారంభమైనా, పట్టణాల్లోని కేసుల సంఖ్యను అధిగమించడానికి పల్లెలకు దాదాపు ఐదు నెలలు పట్టింది. ఆ ఏడాది జులై తర్వాతే గ్రామాల్లో కేసులు పెరగడం ప్రారంభమయ్యాయి. రెండో ఉద్ధృతిలో అందుకు భిన్నంగా కేవలం రెండు నెలల సమయమే పట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో ఉద్ధృతి ప్రారంభమైంది. ఏప్రిల్‌కల్లా 44.1% కేసులతో గ్రామీణ భారతం పట్టణాలను (40.8%) అధిగమించింది.

ఇదీ చూడండి:మహాలో 50 వేల దిగువన కరోనా కొత్త కేసులు

ABOUT THE AUTHOR

...view details