తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెట్లకు మనుషుల పేర్లు.. దత్తత తీసుకుని మరీ నామకరణం.. ఎందుకంటే..

ఆ గ్రామంలో చెట్లకు మనుషుల పేర్లు ఉంటాయి. రోడ్లపై ఉన్న చెట్లను ఆ గ్రామస్థులు.. మనుషుల్లాగానే భావిస్తున్నారు. వృక్షాలను దత్తత తీసుకుని పేరు పెట్టి.. వాటిలో తమ పూర్వీకులను చూసుకుంటున్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతోందంటే?

By

Published : Apr 10, 2023, 7:13 AM IST

trees adoption manipur
trees adoption manipur

చెట్లకు మనుషుల పేర్లు.. దత్తత తీసుకుని మరీ నామకరణం.. ఎందుకంటే..

మణిపుర్‌లోని ఓ గ్రామంలో చెట్లకు మనుషుల పేర్లుంటాయి. ప్రజలు కూడా రోడ్లపై ఉన్న ఆ కొన్ని చెట్లను మనుషుల్లాగానే భావిస్తున్నారు. తమ ఇంట్లో వ్యక్తులుగా చూసుకుంటున్నారు. చెట్లకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటున్నారు. వృక్షాల్లో తమ పూర్వీకులను చూసుకుంటున్నారు.

సేనాపతి జిల్లా మరంబజార్‌ గ్రామంలో చెట్లను ప్రజలు తమ పూర్వీకుల్లా భావిస్తున్నారు. ఇక్కడ చెట్లపై నేమ్‌ బోర్డులు ఉంటాయి. చెట్లను నరకొద్దని చెబితే ఎవరూ వినరు. అందుకే పోలీసులు, మరంబజార్‌ విలేజ్‌ అథారిటీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్ల పక్కన ఉన్న కొన్ని చెట్లను దత్తత తీసుకున్నారు.

చెట్టుకు నేమ్ బోర్డు అతికిస్తున్న అధికారులు

దత్తత తీసుకున్న చెట్లపై గ్రామ పెద్దల పేర్లు గానీ కొందరి వ్యక్తుల పేర్లు గానీ రాస్తున్నారు. వారు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు బతికారు. వారు చేసిన పనులేంటనే వివరాలను నేమ్‌ బోర్డులపై పేర్కొంటున్నారు. పూర్వీకుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చెట్లను ప్రజలు కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. వాటిలో వారి కుటుంబీకులను, గ్రామ పెద్దలను చూసుకుంటున్నారు.

ఓ చెట్టుకు 'ఆంథోనీ' పేరు!

చెట్ల నరికివేత పెరగడం వల్ల.. పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. దీన్ని మొదటగా జనం ఎక్కువగా ఉండే ఓ మార్కెట్‌లో అమలు చేశారు. స్థానికంగా అడవుల నరికివేత ఎక్కవ కావడం, భూగర్భజలాలు ఇంకిపోవడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయోగం చేశామని ఎంబీవీఏ అధికారులు తెలిపారు. తొలి దశలో పోలీసులు, ఎంబీవీఏ అధికారులు 45 చెట్లను దత్తత తీసుకున్నారు. వారి పిలుపుతో ప్రజలు కూడా వారి కుటుంబీకుల పేర్లతో చెట్లను దత్తత తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నారు.

మరంబజార్‌ గ్రామం

కూనిరాగాలే వారి పేర్లు!
మేఘాలయలోని కాంగ్​థాంగ్ గ్రామంలో అక్కడి వారికి మనలాగా పేర్లు ఉండవు. కూని రాగాలతోనే ఒకరిని ఒకరు పిలుచుకుంటారు. ఎందుకంటే అది వారి ఆచారం .. పూర్వీకుల నుంచి ఆ సంప్రదాయం ఉందని కాంగ్​థాంగ్ గ్రామస్థులు చెబుతున్నారు. అందుకే ఆ గ్రామాన్ని 'విజిల్ విలేజ్' అని పిలుస్తున్నారు. కాంగ్​థాంగ్​ గ్రామంలో పుట్టిన వారికి ఈల శబ్దం, పక్షుల అరుపులు లేదా సినిమా పాటల్లోని ట్యూన్‌ ఆధారంగా పేర్లు పెడుతుంటారు. అందరి పేర్లు వేర్వేరుగా.. పదాలు రాకుండా రాగాలతోనే 30 సెకన్లు ఉండేలా చూస్తారు. ఇంట్లో ఉండే సమయంలో మొత్తం పేరు కాకుండా మొదటి ఆరు సెకన్లు, బయట ఉంటే పూర్తి రాగంతో పిలుస్తారు. అడవిలో ఎవరైనా చిక్కుకుపోతే.. తమ పేరును.. అదే కూనిరాగాన్ని గట్టిగా పాడతారట. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details