తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రామస్థుడిని గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు - రాయ్‌పూర్ ఎక్కడ ఉంది?

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. పదునైన ఆయుధంతో గ్రామస్థుడిని హత్య చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు కొంటా ఏరియా కమిటీ ప్రకటించింది. అడవులను అక్రమంగా నరుకుతూ ఆక్రమించేవారికి ఇలాంటి శిక్ష తప్పదని హెచ్చరించారు.

villager
మావోయిస్టు

By

Published : Dec 15, 2021, 6:35 AM IST

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో సాయుధులైన మావోయిస్టులు ఓ గ్రామంపై దాడి చేశారు. స్థానికుడైన డర్రే నవీన్‌ అనే వ్యక్తిని హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

గ్రామస్థుడి ఇంటికి చేరుకున్న నక్సలైట్లు.. అతడిని ఎత్తుకెళ్లి కొంతదూరంలో గొడ్డలితో నరికి చంపారని పోలీసులు వెల్లడించారు. మృతదేహం వద్ద ఓ కరపత్రాన్ని వదిలి కూడా వెళ్లారు. 'నవీన్‌ అక్రమంగా అడవులను నరికి, భూమిని ఆక్రమించుకుంటున్నాడు' అని అందులో ఆరోపించారు. అంతేగాక మరో 10 మందికి పైగా గ్రామస్థుల పేర్లను ప్రస్తావించి.. 'వారిని కూడా ఇదేవిధంగా చంపుతాం' అని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎర్రబోరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఘటనపై గుర్తుతెలియని నక్సలైట్ల పేరిట కేసు నమోదు చేశారు పోలీసులు. కరపత్రాలు వదిలి వెళ్లిన నేపథ్యంలో గ్రామస్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details