పర్యావరణ పరిరక్షణ కోసం ఉత్తర్ప్రదేశ్ కౌశాంబీ జిల్లా అమ్నిలోకీపుర్ గ్రామ ప్రజలు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గ్రామంలో పెళ్లి చేసుకున్న కొత్త జంట చెరో మొక్క నాటిన తర్వాతే ఇంట్లోకి అడుగుపెట్టాలనే నిబంధన పెట్టారు. ఆ మొక్కను తమ తొలి సంతానంగా భావించి, పెంచాలని సూచించారు.
"ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఇప్పటికే అమలు చేస్తున్నాం. కొన్నేళ్ల క్రితం గ్రామంలో చాలా చెట్లు ఉండేవి. ఇళ్ల నిర్మాణం, వ్యవసాయ అవసరాల వల్ల చాలా చెట్లు నరికేశారు. అయితే మళ్లీ గ్రామాన్ని చెట్లతో కళకళలాడేలా చేయాలని ప్రయత్నిస్తున్నాం."