కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి.. స్థానిక పంచాయతీ ఎన్నికల్లో తన ఓటమిని జీర్ణించుకోలేక రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికలు జరిగిన ఏడాది తర్వాత గురువారం రీకౌంటింగ్ జరిగింది. కానీ మళ్లీ ఆయనకు నిరాశే ఎదురైంది.
ఇదీ జరిగింది..
జిల్లాలోని హుక్కేరి తాలూకా హెబ్బాల్లో గతేడాది గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అందులో తవనప్ప హోసూర్, రావాసాహెబ్ పోటీ పడ్డారు. కానీ ఆ ఎన్నికలో రావాసాహెబ్ ఒక్క ఓటు తేడాతోనే ఓడిపోయారు. దీంతో ఓట్ల లెక్కింపు సక్రమంలో జరగలేదని ఆయన కోర్టుకు వెళ్లారు.