Vikram Misri deputy NSA: చైనాకు భారత మాజీ రాయబారి విక్రమ్ మిశ్రి.. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం సోమవారం ప్రకటించింది.
1989 ఐఎఫ్ఎస్ బ్యాచ్ సభ్యుడైన మిశ్రి.. 2019లో రాయబారి బాధ్యతలు స్వీకరించారు. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల మధ్య రాయబారిగా కీలక సేవలు అందించారు. విదేశాంగశాఖ, దిల్లీలోని ప్రధాని కార్యాలయంలో విస్తృత సేవలందించారు మిశ్రి. 2014మే- జులై సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు 2012 అక్టోబర్ నుంచి 2014 మే వరకు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్కు వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికాలో భారత్ మిషన్లకు ప్రాతినిధ్యం వహించారు. మయన్మార్, స్పెయిన్లకు భారత రాయబారిగా కూడా పనిచేశారు.