తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుని రైలు దహనం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు - తాజా కోర్టు తీర్పు

తుని రైలు దహనం
Tuni train burning case

By

Published : May 1, 2023, 3:47 PM IST

Updated : May 1, 2023, 4:28 PM IST

15:42 May 01

తుని రైలు దహనం కేసులో తీర్పు వెల్లడించిన రైల్వే కోర్టు

Tuni train burning case: 2016లో తుని రైలు దహనం కేసులో విజయవాడ రైల్వే కోర్టు తీర్పు వెల్లడించింది. తుని రైలు దహనం ఘటనలో అప్పట్లో రైల్వే పోలీసులు 41 మందిపై కేసులు నమోదు చేశారు. 24 మంది సాక్షుల్లో 20 మందిని రైల్వే కోర్టు విచారించింది. నేరం రుజువు చేయడంలో రైల్వే పోలీసులు విఫలమయ్యారని రైల్వే కోర్టు అభిప్రాయపడింది. ఈ రైలు దహనం కేసుపై ముద్రగడ, దాడిశెట్టి రాజా, నటుడు జీవీ సహా 41 మందిపై అప్పట్లో రైల్వే పోలీసులు అభియోగాలు మోపారు. మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తీర్పు సందర్భంగా కోర్టుకు చేరుకున్నారు. ఈ కేసులో ముగ్గురు రైల్వే పోలీసులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని పీపీని కోర్టు ప్రశ్నించింది. 41 మందిపై పెట్టిన కేసు అక్రమ కేసుగా పరిగణిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
ఇవీ చదవండి:

Last Updated : May 1, 2023, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details