kodi katti case updated news: విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఈరోజు మరోసారి కోడి కత్తి కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఇటీవలే సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలని, కోడి కత్తి కేసులో ఇంకా లోతైన దర్యాఫ్తు చేయాలంటూ రెండు పిటిషన్లు వేశారు. ఆ రెండు పిటిషన్లపై నేడు న్యాయస్థానం విచారణ జరిపింది.
మరోవైపు నిందితుడు (జనిపల్లి శ్రీను అలియాస్ కొడికత్తి శ్రీను), ఎన్ఐఏ తరఫున కౌంటర్లు వేసిన న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు న్యాయవాది.. తదుపరి విచారణను జూన్ 15వ తేదీకీ వాయిదా వేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నిందితుడిని కోర్టుకు తీసుకొచ్చిన పోలీసులు.. కేసు విచారణ మరోసారి వాయిదా పడడంతో మళ్లీ నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి.. జగన్ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న సమయంలో అక్టోబరు 25వ తేదీ 2018న విశాఖపట్టణంలోని విమానాశ్రయంలో.. జనిపల్లి శ్రీను అనే వ్యక్తి జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు నిందితుడు జనిపల్లి శ్రీను అలియాస్ కొడికత్తి శ్రీనుకు శిక్ష విధించింది.
బాధితుడు కోర్టుకు హాజరవ్వాలి..ఈ క్రమంలో నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం.. కోడి కత్తి కేసుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. దాడి సమయంలో జరిగిన పూర్వపరాలను కోర్టుకు తన వాదనల రూపంలో వినిపిస్తూ.. నిందితుడికి బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును వేడుకుంటూ వస్తున్నారు. గత విచారణల్లో న్యాయస్థానం.. కోడి కత్తి కేసులో ప్రధాన బాధితుడుగా ఉన్న జగన్ సాక్ష్యం విలువైనదని.. అది లేకుండా మిగతావారిని విచారించలేమంటూ.. బాధితుడు కచ్చితంగా కోర్టుకు హాజరవ్వలంటూ ఆదేశాలు జారీ చేసింది.
సీఎం హోదాలో ఉన్నాను-కోర్టుకు రాలేను.. ఈ నేపథ్యంలో తాను ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు వస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, తాను కోర్టుకు వస్తే అధికారిక కార్యక్రమాల షెడ్యూల్ దెబ్బతిని, సంక్షేమ పథకాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని.. ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి.. కోడికత్తి కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన సాక్ష్యాన్ని నమోదు చేయాలని ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థిస్తూ.. పిటిషన్ దాఖలాలు చేశారు.
కుట్ర కోణాన్ని వెలికితీయాలి..!.. అనంతరం విశాఖపట్నం విమానాశ్రయంలో తన (జగన్)పై జరిగిన హత్యాయత్నం వెనుక దాగి ఉన్న కుట్రను, అందులో ప్రమేయమున్న వ్యక్తుల గురించి న్యాయస్థానం లోతైన దర్యాప్తును చేపట్టాలని మరొక పిటిషన్ దాఖలాలు చేశారు. కోడి కత్తి దాడిలో కుట్ర కోణాన్ని వెలికితీసేలా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరింత దర్యాప్తును జరిపేలా ఎన్‌ఐఏకు ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్‌లో సీఎం జగన్ కోరారు.
ఇవీ చదవండి