తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కాంగ్రెస్​, భాజపా వల్లే చమురు ధరల మంట' - pinarayi vijayan recent news

ప్రజాసమస్యలపై కాంగ్రెస్​, భాజపాకు చిత్తశుద్ధి లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ఆరోపించారు. పెట్రోల్​, డీజల్​, వంట గ్యాస్​ ధరలు అమాంతంగా పెరగడానికి ఆ రెండు పార్టీల ప్రభుత్వాలే కారణమని విమర్శించారు.

Vijayan blames Congress, BJP for rising oil prices
'చమురు ధరల పెరుగుదలకు కాంగ్రెస్​,భాజపాలే కారణం'

By

Published : Mar 22, 2021, 12:09 PM IST

పెట్రోల్​, డీజల్​, వంట గ్యాస్​ ధరలు అమాంతంగా పెరగడానికి కాంగ్రెస్​, భాజపా ప్రభుత్వాలే కారణమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. చమురు ధరలను విచ్చలవిడిగా పెంచుకునే అధికారం ఇచ్చిందన్నారు. పెరుగుతన్న చమురు ధరలకు వ్యతిరేకంగా నాడు ఎద్దుల బండి నడిపి నిరసన వ్యక్తం చేసిన భాజపా నేతలు... అధికారంలోకి వచ్చిన తరువాత ధరల పెరుగుదలకు వంత పాడుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు.

కాంగ్రెస్​ పార్టీలోని ముఖ్యనాయకులు కొంతమంది భాజపా సాయంతో కేరళ అసెంబ్లీలో తిష్ట వేయాలని చూస్తున్నారని విజయన్​ ఆరోపించారు. ఇది కచ్చితంగా రాజకీయ వ్యాపారమే అవుతుందన్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలు రాబోయే రోజుల్లో బయటకు వస్తాయన్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details