Vijay Diwas 2021: పాకిస్థాన్‌పై 1971 యుద్ధంలో విజయం సాధించి నేటికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.
జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న ప్రధాని అమర వీరులకు ప్రధాని నివాళి ఈ క్రమంలో భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకున్నారు. కలిసికట్టుగా పోరాడి శత్రుమూకలను ఓడించామన్నారు.
అక్కడే నిర్వహించిన 'స్వర్ణిమ్ విజయ్ మాస్హాల్స్'లో పాల్గొన్నారు. అమర జవాన్ జ్యోతిని వెలిగించారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు సైన్యాధికారులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:'కలిసి పోరాటం చేశాము.. అణచివేత శక్తులను ఓడించాము'