తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కలిసి పోరాటం చేశాము.. అణచివేత శక్తులను ఓడించాము' - పాకిస్థాన్​పై భారత్​ విజయం

Vijay Diwas 2021: 1971 యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఆనాటి పోరాట వీరులు, అమర జవాన్లను స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వారికి నివాళులర్పించారు.

PM Modi
ప్రధాని మోదీ

By

Published : Dec 16, 2021, 10:05 AM IST

Updated : Dec 16, 2021, 10:38 AM IST

Vijay Diwas 2021: పాకిస్థాన్​పై యుద్ధంలో విజయం సాధించి నేటికి 50 ఏళ్లు నిండిన సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాన్ని స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కలిసికట్టుగా పోరాడి శత్రుమూకలను ఓడించామన్నారు.

"50వ విజయ్​ దివాస్​ సందర్భంగా భారత సాయుధ దళాలకు చెందిన ముక్తిజోద్ధులు, బీరంగనాదులు, ధైర్యవంతుల గొప్ప శౌర్యాన్ని, త్యాగాన్ని నేను స్మరించుకుంటున్నాను. కలిసికట్టుగా పోరాడి అణచివేత శక్తులను ఓడించాం. ఢాకాలో రాష్ట్రపతి పర్యటించటం ప్రతి భారతీయుడికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిస్తోంది."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

స్మారక స్టాప్​ విడుదల చేసిన రక్షణ మంత్రి

50వ విజయ్​ దివాస్​ను పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద.. స్మారక పోస్టల్​ స్టాంప్​ను విడుదల చేశారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

యుద్ధ స్మారకం వద్ద స్టాలిన్​ నివాళులు

1971లో పాకిస్థాన్​పై యుద్ధంలో విజయం సాధించిన క్రమంలో నిర్వహిస్తోన్న విజయ్​ దివాస్​లో అమర జవాన్లకు నివాళులర్పించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. చెన్నైలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి ఘటించి.. సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

ఇదీ చూడండి:

విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి

'ఆ శరణార్థులకు భారత్​ సొంత ఇంటిని ఇచ్చింది'

కోవింద్​తో బంగ్లా ప్రధాని భేటీ- ద్వైపాక్షిక అంశాలపై చర్చ

Last Updated : Dec 16, 2021, 10:38 AM IST

ABOUT THE AUTHOR

...view details