Vigilance Raid in Patna: బిహార్ పట్నాలోని కిషన్‌గంజ్ డివిజన్ రూరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజయ్ కుమార్ రాయ్ ఇంటిపై విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం ఉదయం దాడులు ప్రారంభించగా.. ఇప్పటివరకు దాదాపు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. కిషన్‌గంజ్, పట్నా ప్రాంతాల్లో దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
అయితే, విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వెళ్లినప్పుడు, నిందితుడు అవినీతి సొమ్మును అతని జూనియర్, క్యాషియర్ ఇంట్లో దాచే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు, వారి ఇళ్లలో కూడా దాడులు చేశారు. కిషన్‌గంజ్‌లో రూ.4 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్నాలో దాదాపు రూ.1 కోటి రూపాయలు దొరికాయి.