తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలా- పనివాళ్లా?.. వంట పాత్రలు శుభ్రం చేయించి.. - గ్రేటర్ నోయిడా వార్తలు

బాలల దినోత్సవం నాడు పిల్లలకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. అయితే ఈ వీడియోలో.. ఓ పాఠశాలలో పిల్లలు భారీ సైజు వంట పాత్రలు శుభ్రం చేస్తూ కనపడ్డారు. మధ్యాహ్న భోజన పాత్రలను శుభ్రం చేయాలని తమ టీచర్లే ఆదేశించినట్టు పిల్లలు చెప్పారు.

children
పిల్లలు

By

Published : Nov 14, 2021, 9:59 PM IST

Updated : Nov 15, 2021, 11:14 AM IST

పిల్లలతో పనిచేయిస్తూ..

మధ్యాహ్న భోజన పాత్రలను ఓ పాఠశాల.. చిన్నారుల చేత శుభ్రం చేయిస్తున్న ఘటన గ్రేటర్​ నోయిడాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బాలల దినోత్సవం నాడే ఈ ఘటన వెలుగుచూడటం గమనార్హం.

చేతిపంపు వద్ద అతికష్టం మీద..

గ్రేటర్ నోయిడాలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన పాత్రలను పిల్లలే శుభ్రం చేస్తుండటం వీడియోకు చిక్కింది. దాద్రి జిల్లా సైత్లీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని చేతిపంపు వద్ద పిల్లలు భారీ సైజులోని పాత్రలను శుభ్రం చేస్తూ కనిపించారు. దీనిపై ఉపాధ్యాయులను వివరణ కోరగా.. వారి వద్ద నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయితే తమ టీచర్లే ఆ వంట పాత్రలను శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించారని పిల్లలు చెప్పారు.

ఈ వీడియోపై స్పందించిన అధికారులు.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకుంటామని గౌతమ్ బుద్ద నగర్ జిల్లా ప్రాథమిక విద్యా అధికారి ధర్మేంద్ర సక్సేనా వివరించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 15, 2021, 11:14 AM IST

ABOUT THE AUTHOR

...view details