ఉత్తర్ప్రదేశ్ గాజియాబాద్ జిల్లాలోని 'లోనీ' సరిహద్దు ప్రాంతం బీచ్ రోడ్లో ఓ యువకుడిని ఇద్దరు దుండగులు కర్రలతో చితకబాదారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇదీ జరిగింది..
'లోనీ' పోలీస్టేషన్ పరిధిలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితుడు, దుండగులు ఒకే కాలనీలో నివసిస్తారు. ఈ క్రమంలోనే జులై 20న బాధితుడు పని కోసం వెళ్తుండగా.. అడ్డుకున్నారు. తమకు నమస్కారం చేయాలని బెదిరించారు. అందుకు అతను నిరాకరించగా విచక్షణ రహితంగా కర్రలతో చితకబాదారు. యువకుడిని కొడుతున్న సమయంలో అక్కడ ఉన్నవారు ఆపేందుకు ప్రయత్నించకుండా.. తమ ఫొన్లతో రికార్డు చేసేందుకే మొగ్గు చూపటం గమనార్హం.