కరోనా నేపథ్యంలో భారతీయ సంప్రదాయ విధానమైన యోగాను దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
"యోగా అనేది మానవాళికి భారత్ అందించిన గొప్ప బహుమతి. దైనందిన జీవితంపై ఆసక్తిని పెంచుతూ.. వారి జీవితాల్లో గొప్ప మార్పును కలిగించేందుకు దోహదం చేస్తుంది."
-వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి