Vice President Election: రాష్ట్రపతి ఎన్నికకు చకచకా అడుగులు పడుతున్న నేపథ్యంలోనే.. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రకటన విడుదలైంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. జులై 5వ తేదీన ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 19 వరకు నామినేషన్లు సమర్పించే అవకాశం కల్పించనున్నట్లు ఈసీ తెలిపింది. పోలింగ్ అనివార్యమైతే.. ఆగస్టు 6వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. కౌంటింగ్ కూడా అదే రోజు జరగనుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. వెంకయ్య వారసుడు ఎవరో?
Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ప్రకటన విడుదలైంది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు వారసుడు ఎవరనే అంశంపై చర్చ ప్రారంభమైంది.
VICE PREZ POLL
ఈ నేపథ్యంలో తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు వారసుడిగా ఎవరు వస్తారనే చర్చ మొదలైంది. ఉపరాష్ట్రపతిగా ఐదేళ్ల కాలంలో అత్యంత సమర్థంగా సేవలందించారు వెంకయ్య. పెద్దల సభ ఛైర్మన్గా ఆయన హయాంలో రాజ్యసభ పనితీరు ఎన్నడూ లేని విధంగా నమోదైంది.
ఇదీ చదవండి:
Last Updated : Jun 29, 2022, 5:34 PM IST