దేశవ్యాప్తంగా కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని 'రెడ్ లెటర్ డే(గొప్ప కార్యం జరిగిన రోజు)' గా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు.
"కొవిడ్‌పై పోరులో మైలురాయిని చేరుకోవడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణం. వ్యాక్సిన్‌ను శరవేగంగా రూపొందించడంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలు అందరికీ నా అభినందనలు."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
"ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని నూతన భారతం విపత్కర పరిస్థితులను అవకాశాలుగా మలుచుకుంటోంది. ఈ మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ఆత్మనిర్భర్ భారత్‌కు నిదర్శనం. కొవిడ్ వారియర్స్ అందరికీ నా ధన్యవాదాలు.''
-అమిత్ షా, కేంద్ర హోం మంత్రి
"ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా భారత్‌కు అభినందనలు.''
-హర్షవర్ధన్, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
"కొవిడ్‌పై పోరులో భారత్ ఆత్మనిర్భర్‌గా మారింది. మోదీ నాయకత్వానికి నా అభినందనలు. వందే మాతరం"
-రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి
తొలి టీకా అనుభవాలు..
తొలి టీకా తీసుకున్న పలువురు తమ అనుభవాన్ని పంచుకున్నారు.
"తోటి ఉద్యోగులు టీకా తీసుకోవడానికి భయపడ్డారు. నా భార్య కూడా నేను టీకా తీసుకోవడానికి ఒప్పుకోలేదు.
వాళ్ల భయాన్ని పోగొట్టేందుకు నేను టీకా తీసుకున్నాను."-మనీష్ కుమార్, దిల్లీలో తొలి టీకా పొందిన వ్యక్తి.
"ఇది మానవాళికి గొప్ప రోజు. తొలి డోసు నాకు అందడంపై గర్వంగా ఉంది."
-బిపాషా సేత్, బంగాల్లో తొలి టీకా పొందిన వ్యక్తి