Chief of the Naval Staff: భారత నూతన నౌకాదళ అధినేతగా ఆర్. హరికుమార్ నియమితులయ్యారు. అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు వైస్ అడ్మిరల్‌గా కొనసాగారు హరికుమార్.
భారత నూతన నావికాదళపతిగా అడ్మిరల్ ఆర్. హరికుమార్ దిల్లీలోని సౌత్‌బ్లాక్ ఆవరణలో సైనికులు ఆయనకు గౌరవ వందనం చేశారు. పలువురు అధికారులు అడ్మిరల్ హరికుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తనకు అరుదైన గౌరవం దక్కిందని హరికుమార్ తెలిపారు.
"భారత నూతన నావికాదళపతిగా బాధ్యతలు స్వీకరించడం ఒక అరుదైన గౌరవం. జాతీయ నౌకాదళ సవాళ్లపై భారత నావికాదళం దృష్టిసారిస్తుంది."
-- అడ్మిరల్ ఆర్. హరికుమార్, నూతన నావికాదళపతి
1962, ఏప్రిల్ 12న జన్మించిన ఆర్. హరికుమార్.. 1983, జనవరి1న ఇండియన్ నేవీలో ఉద్యోగిగా చేరారు. 39 ఏళ్లపాటు పలు విభాగాల్లో సేవలు అందించారు.
అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ రెండున్నర సంవత్సరాలపాటు పదవిలో కొనసాగారు. పదవీవిరమణ సమయంలో మీడియాతో మాట్లాడారు.
" రెండున్నరేళ్ల పదవీకాలంలో గల్వాన్ ఘర్షణలు, కొవిడ్-19 సంక్షోభం చూశాను. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొవడంలో నేవీ అత్యుత్తమ పనితనాన్ని ప్రదర్శించింది. నావికాదళం.. ఎల్లప్పుడూ ప్రజలకు, జాతికి సేవచేస్తూ అందుబాటులో ఉంటుంది.
-- అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్, మాజీ నౌకాదళాధిపతి
ఇదీ చూడండి:పింఛన్ల విరాళాలకు త్వరలో ప్రధాని మోదీ పిలుపు