కరోనా వల్ల చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెల కొరత వేధిస్తోంది. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు కట్టెలను వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కట్టెల కొరత తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పిడకలను తయారు చేయాలని విశ్వహిందూ పరిషత్ నిర్ణయించుకుంది. ఇందుకోసం పిడకలు(ఆవు పేడ మాత్రమే) తయారు చేసే ప్లాంటునే నిర్మించ తలపెట్టింది.
తమ ప్లాంట్‌లో తయారు చేసిన పిడకలను దిల్లీలోని శ్మశాన వాటికలకు పంపించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ దిల్లీ విభాగం అధ్యక్షుడు కపిల్ ఖన్నా ఈటీవీ భారత్‌కు తెలిపారు. మొదటి ప్లాంట్‌ను పాకిస్థాన్నుంచి శరణార్థులుగా వచ్చిన వారు ఉంటున్న దిల్లీలోని రోహిణి క్యాంప్ సమీపంలో పెడతామని తెలిపారు. ఇందుకు అవసరమైన సామగ్రిని గుజరాత్‌లోని భావ్‌నగర్ నుంచి తెప్పిస్తున్నట్లు వెల్లడించారు.