తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం - bomb near Mukesh Ambanies home updates

Vehicle with explosives spoted near Mukesh Ambanies home
ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

By

Published : Feb 25, 2021, 7:41 PM IST

Updated : Feb 25, 2021, 9:58 PM IST

19:37 February 25

ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాల కలకలం

రిలయన్స్​ ఇండస్ట్రీస్​ ఛైర్మన్​ ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. పేలుడు పదార్థాలు ఉన్న ఓ కారును గుర్తించారు పోలీసులు. ఈ వాహనాన్ని తొలుత ఆయన భద్రతా సిబ్బంది గుర్తించారు. ముకేశ్‌ నివాసం వద్దకు చేరుకున్న బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలు..పేలుడు పదార్థాలను జిలెటిన్‌ స్టిక్స్‌గా గుర్తించాయి. ఆ వాహనానికి సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ స్పందించారు. "ముంబయిలోని ముకేశ్​ అంబానీ నివాసం సమీపంలో గురువారం జిలెటిన్​ స్టిక్స్​ ఉన్న కారును పోలీసులు గుర్తించారు. దీనిపై ముంబయి పోలీసు క్రైమ్​ బ్రాంచ్​ దర్యాప్తు చేస్తోంది." అని  దేశ్​ముఖ్​ పేర్కొన్నారు.

Last Updated : Feb 25, 2021, 9:58 PM IST

ABOUT THE AUTHOR

...view details