తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెత్త కుప్ప​లో 5 నెలల చిన్నారి.. పైనుంచి దూసుకెళ్లిన లారీ.. అక్కడికక్కడే..

ఐదు నెలల చిన్నారిని ప్లాస్టిక్​ కవర్​లో చుట్టి చెత్త కుప్పలో పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ కవర్​ పైనుంచి ఓ వాహనం దూసుకెళ్లడం వల్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. పూర్తిగా నలిగిపోయిన చిన్నారి మృతదేహాన్ని గుర్తుపట్టడం కష్టతరంగా మారింది.

Vehicle ran over a baby hidden in garbage heap
Vehicle ran over a baby hidden in garbage heap

By

Published : Mar 5, 2023, 7:08 AM IST

Updated : Mar 5, 2023, 8:55 AM IST

మానవత్వానికి మచ్చ తెచ్చేలా.. 5 నెలల చిన్నారిని చెత్త కుప్పలో పడేశారు. అనంతరం ఆ పసికందు పైనుంచి ఓ వాహనం దూసుకెళ్లింది. దీంతో ఆ శిశువు అక్కడికక్కడే మృతిచెందింది. ఫిబ్రవరి 28న బెంగళూరులో జరిగిన ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫిబ్రవరి 28న బెంగళూరు అమృతహళ్లి ప్రాంతలోని పంపా లేఅవుట్​ సమీపంలో ఈ ఘటన జరిగింది. అక్కడే ఉన్న చెత్త కుప్పలో 5 నెలల చిన్నారిని ప్లాస్టిక్​ కవర్​లో చుట్టి పడేశారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆ చెత్తను తీసుకెళ్లడానికి బీబీఎమ్​పీ లారీ వచ్చింది. ఆ తర్వాత సిబ్బంది చెత్తను ఆ లారీలో వేశారు. అయితే లారీ బయలుదేరుతుండగా.. కవర్​లో కట్టిన చిన్నారి జారిపడింది. అనంతరం వెనుక వస్తున్న ఓ వాహనం.. ఆ చిన్నారి పైనుంచి వెళ్లింది. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, చిన్నారి మృతదేహం నలిగిపోవడం వల్ల.. ఆడ శిశువా లేక మగ శిశువా అని గుర్తు పట్టడం కష్టతరంగా మారింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అమృతహళ్లి పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, బిడ్డ పుట్టిన విషయం దాచిపెట్టాలనే ఉద్దేశంతో.. ఈ చిన్నారిని ప్లాస్టిక్​ కవర్​లో చుట్టి చెత్త కుప్పలో పడేశారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

విహార యాత్రలో విషాదం..
సరదాగా స్నేహితులంతా కలిసి వెళ్లిన విహార యాత్ర విషాదాంతం అయింది. విహార యాత్రకు వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన కమలా నెహ్రూ కాలేజీ విద్యార్థులు విహార యాత్ర ప్లాన్​ చేశారు. హిమాచల్​ప్రదేశ్​లో ఉన్న మనాలీకి HR 38 AB 0007 నంబరు బస్సులో బయలు దేరారు. బస్సు.. మనాలి- చండీగఢ్​ హైవేపై బిలాస్​పుర్​ జిల్లా కేంద్రానికి సమీపంలో బోల్తా పడింది. దీంతో ఓ విద్యార్థిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను బిలాస్​పుర్​ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 41 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

కాగా, ఈ ఘటనపై స్పందించిన కమలా నెహ్రూ కాలేజీ ప్రిన్సిపాల్​.. అది కాలేజీ ప్లాన్​ చేసిన టూర్​ కాదని తెలిపారు. ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 42 మంది ఉన్నారని.. అందులో 33 మంది కమలా నెహ్రూ కాలేజీకి చెందిన వారని.. మిగతా అందరూ ఇతర కాలేజీ వాళ్లని వెల్లడించారు.

చిరుత దాడి.. యువతి మృతి..
మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లో ఓ యువతిపై చిరుత దాడిచేసింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులతో పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ధమ్​పుర్​ అటవీ రేంజర్ గోవింద్​ రామ్​ గంగ్వార్​ తెలిపారు. ​

Last Updated : Mar 5, 2023, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details