ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యుమనోత్రి ధామ్ దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా.. బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భక్తులంతా మహారాష్ట్రకు చెందినవారు. గాయపడినవారిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం రంగంలోకి దిగి స్థానికుల సాయంతో చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు భక్తులు మృతి - palghar accident news
ఉత్తరాఖండ్ యమునోత్రి హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. మహారాష్ట్రకు చెందిన భక్తులు దర్శనానికి వెళ్లి తిరిగివస్తుండగా బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర పాల్ఘర్లో జరిగిన మరో ప్రమాదంలో బస్సు లోయలో పడి 15మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
పాల్ఘర్ బస్సు ప్రమాదం
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా వఘోబా ఘాటాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి 25 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ పోలీసులు స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బస్సు భుసావాల్ నుంచి బోయిసర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి:ఆ అనుమానంతో కుటుంబాన్ని చితకబాది.. మూత్రం తాగించిన గ్రామస్థులు!