Accident in chamba: హిమాచల్‌ప్రదేశ్ ఛంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో వాహనంలో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికార బృందం.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
గుంతలో పడ్డ ఆర్మీ వెహికల్..మరో ఘటనలో ప్రయాణిస్తున్నఓ ఆర్మి వాహనం ప్రమాదానికి గురైంది. ఝార్ఖండ్ గిరిడీలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం.. మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుమ్రి రోడ్డు సమీపంలోకి రాగానే అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారు. ఈ బస్సు మధుబన్ నుంచి ఛత్రాకు వెళ్తున్నట్లు పోలీస్ స్టేషన్ ఇంఛార్జీ మృత్యుంజయ్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం దుమ్రి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు.