తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మాంస పదార్థాలు వాడి.. శాకాహారంగా చెప్పడం సరికాదు' - శాఖాహారంలో మాంసాహార పదార్థాలు

Veg or Non Veg: శాకాహారోత్పత్తుల్లో మాంస పదార్థాలను వినియోగిస్తూ వాటిని శాకాహారంగా చెప్పడం మత, సాంస్కృతిక హక్కులకు భంగం కలిగించడమేనని దిల్లీ హైకోర్టు తెలిపింది. ఆహారోత్పత్తుల్లో వాడే ప్రతి మూల పదార్థాన్ని పేర్కొనేలా ఉత్పత్తి సంస్థలను ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వాన్నీ, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)నీ హైకోర్టు ఆదేశించింది.

Veg or non veg
శాఖాహారంలో మాంసాహార పదార్థాలు

By

Published : Dec 15, 2021, 7:03 AM IST

Veg or Non Veg: శాకాహారోత్పత్తుల్లో మాంస పదార్థాలను వినియోగిస్తూ వాటిని శాకాహారంగా చెప్పడాన్ని దిల్లీ హైకోర్టు ఆక్షేపించింది. అది శుద్ధ శాకాహారుల మత, సాంస్కృతిక హక్కులకు భంగం కలిగించడమేనని, వారి మత స్వేచ్ఛను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఉద్ఘాటించింది. ఆహారోత్పత్తుల్లో వాడే ప్రతి మూల పదార్థాన్ని పేర్కొనేలా ఉత్పత్తి సంస్థలను ఆదేశించాలని రామ్‌ గోరక్షా దళ్‌ ట్రస్టు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టుపై విధంగా వ్యాఖ్యానించింది.

Non Veg Ingredients In Veg:

ప్రస్తుతం శాకాహారంగా విక్రయిస్తున్న నూడుల్స్‌, బంగాళా దుంప చిప్స్‌ వంటి ఉపాహారాలలో పంది మాంసం, చేపల నుంచి తీసిన ఒక పదార్థాన్ని వాడుతున్నారని పిటిషన్‌దారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ తాము ఏమి భుజిస్తున్నదీ తెలుసుకునే హక్కు ప్రతి పౌరునికీ ఉందని పేర్కొంది. ఇకపై ప్రతి ఆహారోత్పత్తిలో వాడిన పదార్థాలు మొక్కల నుంచి వచ్చాయా లేక జంతువుల నుంచా లేక ప్రయోగశాలలో తయారైందా అనే అంశాలను ఉత్పత్తిదారులు సవివరంగా తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)నీ హైకోర్టు ఆదేశించింది.

ఇదీ చదవండి:అత్యాచారం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన మహిళపై మరోసారి..

ముంద్రా పోర్ట్​ డ్రగ్స్​ కేసులో అఫ్గాన్​ వ్యక్తి అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details