తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్టెరిలైట్' నుంచి ఆక్సిజన్ సరఫరా షురూ - medical oxygen vedanta tamil nadu

తమిళనాడు తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ ప్లాంట్​ నుంచి ఆక్సిజన్ సరఫరా ప్రారంభమైంది. తొలి ట్యాంకులో 4.8 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్​ను పలు ఆస్పత్రులకు పంపించింది సంస్థ. 98శాతానికి పైగా స్వచ్ఛతతో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్​ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపింది.

Vedanta Sterlite: First batch of medical oxygen dispatched
స్టెరిలైట్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా షురూ

By

Published : May 13, 2021, 12:54 PM IST

తమిళనాడు తూత్తుకుడిలోని వేదాంత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్​లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. రోజుకు రెండు ఆక్సిజన్ ట్యాంకులను ఆస్పత్రులకు సరఫరా చేస్తోంది. తొలి ట్యాంకులో 4.8 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్​ను తిరునెల్వేలి, తూత్తుకుడి జిల్లాలకు పంపించినట్లు సంస్థ తెలిపింది. మే 12 నుంచి ఇక్కడ ప్రాణావాయువు ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఆక్సిజన్ ట్యాంకును జెండా ఊపి ప్రారంభిస్తున్న అధికారులు

2018లో జరిగిన కాల్పుల ఘటన అనంతరం ఈ ప్లాంట్​ను మూసేసింది తమిళనాడు సర్కార్. పర్యావరణ సమస్యలపై కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన నిరసనకారుల్లో 13 మంది పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. అప్పటి నుంచి ఈ ప్లాంట్ నిరుపయోగంగా ఉంది.

ఆస్పత్రులకు పయనమైన తొలి ఆక్సిజన్ ట్యాంకు

అయితే, గత అన్నాడీఎంకే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి.. ఈ ప్లాంట్​ను పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఇతర కార్యకలాపాలేవీ చేపట్టకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీతో ఏర్పాటు చేసిన కమిటీ ఆక్సిజన్ ఉత్పత్తిని పర్యవేక్షిస్తోంది.

ప్లాంట్​లో 98.6 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ తయారు చేస్తున్నామని స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ సీఈఓ పంకజ్ కుమార్ చెప్పారు. మెడికల్ గ్రేడ్ అనుమతులన్నీ తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:వేడి నీళ్ల స్నానంతో.. కరోనా రాదా?

ABOUT THE AUTHOR

...view details