తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త ఇంటికి పేరు పెడుతున్నారా? - ఈ వాస్తు సూచనలు పాటించాల్సిందేనట! - Vastu Based Lucky House Names

Vastu Tips for House : ఈ మధ్య కాలంలో కొత్తగా నిర్మిస్తున్న ప్రతిఇంటికీ తప్పకుండా పేరు పెట్టుకుంటున్నారు. అయితే.. పేరు పెట్టే విషయంలోనూ వాస్తు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. మరి.. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Vastu Tips
Vastu Tips for House

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2023, 3:19 PM IST

Vastu Tips for House Names in Telugu : కొత్తగా ఇంటిని నిర్మించేటప్పుడు చాలా మంది వాస్తు నియమాలు పాటిస్తుంటారు. ఇల్లు కట్టుకున్న తర్వాత.. ఆ ఇంట్లో ఉండే ప్రతి వస్తువు విషయంలోనూ వాస్తు నియమాలను అనుసరిస్తుంటారు. ఎందుకంటే.. వస్తువులను సరైన దిశలో ఉంచకపోతే ప్రతికూల శక్తులు విజృంభిస్తాయని.. కుటుంబానికి పలు విధాలుగా నష్టం కలిగిస్తాయని నమ్ముతారు. అందుకే.. పక్కాగా వాస్తు ప్రకారం అన్నీ ఉండేలా చూసుకుంటారు.

అయితే.. కేవలం ఇంటి నిర్మాణానికి, ఇంట్లోని వస్తువులకే కాకుండా.. ఇంటికి పెట్టే పేరు విషయంలోనూ వాస్తు చూడాలని చెబుతున్నారు! ఈ మధ్య కొత్తగా నిర్మించే ప్రతి ఇంటికీ తమకు నచ్చిన పేరు పెడుతున్నారు యజమానులు. అయితే.. ఆ పేరు మీ ఇంటి నిర్మాణానికి తగ్గట్టుగా ఉండాలని.. పేరు ఏర్పాటు చేసే స్థలం కూడా వాస్తు ప్రకారం ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అప్పుడే అందులో నివసించేవారందరూ సంతోషంగా జీవిస్తారట. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

వాస్తు శాస్త్రం ప్రకారం..

  • ముందుగా మీ ఇంటికి పెట్టే పేరు.. సానుకూల అర్థాన్ని కలిగి ఉండేలా చూసుకోవాలట.
  • సానుకూల శక్తిని ఆకర్షించడంలో ఈ పేరు సహాయపడుతుందట.
  • మీ ఇంటికి పెట్టే పేరు కాస్త ప్రత్యేకంగా ఉండేలా చూసుకోవాలట. ముఖ్యమైన విషయం ఏమంటే.. ఆ పేరును మీ ఇరుగుపొరుగువారు వాళ్ల ఇంటికి పెట్టుకొని ఉండకూడదట.
  • అలాగే మీరు ఇంటికి పెట్టే పేరును రాయి లేదా చెక్కపై చెక్కాలని వాస్తు శాస్త్రంలో స్ప‌ష్టం చేస్తోంది.
  • అదేవిధంగా.. మీ ఇంటి పేరు ఎల్లప్పుడూ మీరు ఇంట్లోకి ప్రవేశించే గోడపైనే ఉండాలి.
  • ప్రధాన ద్వారం గేటు వద్ద ఇంటి పేరు రాయవద్దనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
  • ఇంటి పేరు ప్రతిష్టించిన తర్వాత.. దానిపైన చిన్న బల్బు లేదా ట్యూబ్ లైట్ పెట్టాలి.
  • ఇలా చేయడం ద్వారా మీ ఇల్లు ఉత్తేజకరమైన శక్తితో నిండిపోతుందట.
  • అలాగే మీరు ఇంటికి పెట్టిన పేరు ప్రభావాన్ని మరింతగా మెరుగుపరచాలనుకుంటే.. ఆ పేరు ముందు లేదా పైన స్వస్తిక్‌ లేదా ఓం చిహ్నాన్ని ఉంచాలట.

ఇంటికి అదృష్టాన్ని తెచ్చే కొన్ని ఇంటి పేర్లను పరిశీలించండి..

  • శివశక్తి : శివ భక్తుని ఇంటి పేరు
  • శాంతినికేతం : శాంతి ధామం
  • శ్రీనివాసం : సంపదల నిల‌యం, లక్ష్మీదేవి నివాసం
  • రామాయణం : పవిత్ర హిందూ మత గ్రంథం పేరు
  • అషియానా : ఆశ్రయం
  • ఆనంద నిలయం : ఆనందకరమైన శాంతికి నిలయం
  • శాశ్వ‌త‌ : ఏకైక, మొదటి
  • దీవెన : దేవుడి దయ
  • ప్రేమ్ కుంజ్‌ : ప్రేమతో నిండిన ఇల్లు

మీరు మీ కొత్త ఇంటికి పేరు పెట్టాలని చూస్తున్నట్టయితే.. ఇక్కడ సూచించిన పేర్లలో ఒకదానిని ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా పేరును ఎంచుకొని.. పైన పేర్కొన్న వాస్తు నియమాలను పాటిస్తే.. మీ ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని ఐశ్వర్యం కొలువుంటుందని చెబుతున్నారు.

ఇంట్లో గణపతి చిత్రం ఏ దిక్కున ఉండాలి - వాస్తు చెబుతున్నది ఇదే!

గుమ్మం వద్ద ఇవి పెడుతున్నారా? ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చొరబడుతుందట!

Vastu Tips for Happy Living : మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా..? అప్పుడే ప్రశాంతత!

ABOUT THE AUTHOR

...view details