తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Vastu Tips for Happy Living : మీరు ఈ వాస్తు సూత్రాలు పాటిస్తున్నారా..? అప్పుడే ప్రశాంతత! - వాస్తు టిప్స్​

Vastu Tips for Harmonious Living in Compact Spaces: వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలని దాదాపుగా అందరూ అనుకుంటారు. అయితే.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సూచనలు చేస్తుంటారు. దీంతో.. చాలా మందిని పలు సందేహాలు వేధిస్తుంటాయి. మరి.. వాస్తుకు సంబంధించి ఎలాంటి సూత్రాలు పాటించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Vastu Tips for Happy Living
Vastu Tips for Happy Living

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 2:03 PM IST

Vastu Tips for Harmonious Living in Compact Spaces: మెజారిటీ భారతీయులు వాస్తును బలంగా విశ్వసిస్తారు. ఇల్లు కట్టుకోవాలన్నా.. లేదా మరేదైనా నిర్మాణం చేపట్టాలన్నా.. ముందుగా చేసే పని వాస్తు పరిశీలన. ఇంటికి వాస్తు సరిగా ఉంటేనే.. ఇంట్లో సుఖ శాంతులు నెలకొంటాయని.. వ్యక్తిగత జీవితం కూడా సజావుగా సాగిపోతుందని భావిస్తారు. మరి, వాస్తులో కీలకమైన ఈ విషయాలు మీకు తెలుసా..? ఇవి తప్పక పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఇంటి ప్రవేశం​: ఇంట్లోకి అడుగు పెట్టాలంటే.. ముందుగా గడప దాటుతాం. ఈ ప్రవేశ ద్వారం వద్ద చీకటి లేకుండా చూసుకోవాలట. స్వాగతం పలుకుతున్న భావన కలిగించేలా.. మృదువైన లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోనాలని సూచిస్తున్నారు. మీరు లోపలికి అడుగు పెట్టే ముందు.. సానుకూల శక్తిని ప్రేరేపించడం కోసం.. అలంకారమైన డోర్‌మ్యాట్ లేదా సంప్రదాయ కళ ఉన్న హ్యాంగింగ్స్​ వంటివి ఏర్పాటు చేసుకుంటే మంచిదట. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

వాస్తు దోషం ఉంటే పిల్లలు పుట్టరా? సంతానలేమికి దీనికి సంబంధమేంటి?

ఇంట్లో ప్రతి పనికీ వేర్వేరు గదులు కేటాయించాలి. అంటే.. హాల్​, కిచెన్​, బెడ్​రూమ్​, స్టడీరూమ్​.. లాంటివి. ప్రశాంతతను ప్రేరేపించడానికి మీ స్టడీ లేదా వర్క్ డెస్క్‌ని ఉత్తర లేదా తూర్పు మూలలో ఉంచండి. అదే విధంగా.. నైరుతి మూలలో పడకగది ఏర్పాటు చేయడం వల్ల ప్రశాంతమైన నిద్రకు ఆస్కారం ఉంటుంది.

కిచెన్: వంటగదిని ఏ ఇంటికైనా గుండెగా పరిగణిస్తారు. ఈ స్థలాన్ని డిజైన్ చేసేటప్పుడు వాస్తు సూత్రాలను అనుసరించాలి. మీ వంటలలో అభిరుచిని రేకెత్తించడానికి స్టవ్‌ను ఆగ్నేయ మూలలో ఉంచండి. వంటగదిలోకి ఎక్కువ వెంటిలేషన్ వచ్చేలా కట్టడం వల్ల, సానుకూల శక్తికి అవకాశం ఉంటుంది.

బాల్కనీలు:మీరు నివసించే ఇంట్లో బాల్కనీ ఉంటే.. దానిని సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి పలు రకాల మొక్కలను పెంచండి. ఈశాన్య మూలలో మొక్కలను ఉంచడం వల్ల శ్రేయస్సు, పెరుగుదల ఉంటుంది.

కలర్స్​: రంగులు మన మానసిక స్థితి, శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించడానికి పాస్టెల్ గ్రీన్స్​, బ్లూ, మట్టి టోన్‌లను ఎంచుకోండి. స్థలానికి శక్తిని జోడించడానికి.. ప్రకాశవంతమైన, శక్తివంతమైన రంగులను మితంగా ఉపయోగించవచ్చు.

మిర్రర్డ్ ఇల్యూజన్:అద్దాలు శక్తిని ప్రతిబింబిస్తాయి, అలాగే పెంచుతాయి. అద్దాలను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయడం వల్ల మీ ఇల్లు పెద్దదిగా అనిపించవచ్చు. అయితే.. అద్దాలను నేరుగా ప్రవేశ ద్వారం ఎదురుగా ఉంచకూడదట. ఇలా చేస్తే.. సానుకూల శక్తి దూరం అవుతుందట.

వాస్తు భయాలు డోంట్​ కేర్.. అనేక ఏళ్ల తర్వాత ఆ తలుపులు తెరిపించిన సీఎం

లైట్ ది వే:సానుకూల శక్తి ప్రవాహానికి తగినంత లైటింగ్ కీలకం. సహజ కాంతి ఉత్తమం. కాబట్టి ఇంటి నిర్మాణం చేసే ముందు.. బాగా వెలుతురు వచ్చే ప్రదేశంలో కిటీకీలను ఉంచడానికి ప్రయత్నించండి. కృత్రిమ కాంతి కోసం పలు లైట్లను ఎంచుకోండి.

ఆర్ట్ ఆఫ్ అరేంజ్‌మెంట్: ఫర్నిచర్‌ను అందగా అమర్చండి. ముందు తలుపు వీలైనంత వరకు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉండాలి. తలుపు ఈశాన్య దిక్కులో ఉంటే శుభప్రదం. ఇంటి తలుపు ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి దిశలో ఉండకూడదు. ఇది శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

పవిత్ర స్థలాలు: ధ్యానం లేదా పూజలు చేసుకోవడానికి ఒక చిన్న గదిని సృష్టించండి. గరిష్ట సానుకూల శక్తి కోసం ఈ గదిని ఈశాన్య మూలలో ఉంచండి.

Note: ఈ స్టోరీ పలువురు వాస్తు నిపుణులు అందించిన సమాచారం ప్రకారం.. మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా రూపొందించబడింది.

గుమ్మాలు, కిటికీలు సరి సంఖ్యలోనే ఉండాలా?

ABOUT THE AUTHOR

...view details