తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాట తగ్గని కరోనా ఉద్ధృతి - కర్ణాటక కరోనా మరణాలు

దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. తమిళనాడులో కొత్తగా 36,184 మందిలో వైరస్​ వెలుగుచూడగా.. కేరళలో మరో 29,673 మంది కరోనా బారిన పడ్డారు.

corona cases
కరోనా కేసులు

By

Published : May 21, 2021, 9:56 PM IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ.. తమిళనాడులో వ్యాప్తి తగ్గుముఖం పట్టడం లేదు. అక్కడ కొత్తగా 36,184 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మరో 467 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 17,70,988కి పెరిగింది. మృతుల సంఖ్య 19,598కి చేరగా.. 14,76,761 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

వివిధ రాష్ట్రాల్లో నమోదైన కేసులు..

  • దిల్లీలో కొత్తగా 3,009 కేసులు బయటపడ్డాయి. 252 మంది మహమ్మారికి బలయ్యారు.
  • కేరళలో 29,673 కేసులు వెలుగులోకి వచ్చాయి. 128 మంది మరణించారు.
  • కర్ణాటకలో 32,218 కేసులు నమోదవ్వగా.. 353 మంది మృతి చెందారు.
  • మహారాష్ట్రలో తాజాగా 29,644 కేసులు వెలుగుచూశాయి. 555 మంది కరోనాతో మరణించారు.

ABOUT THE AUTHOR

...view details