దేశంలో కరోనా కేసుల వృద్ధి అనూహ్యంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. నేడు 11 రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నారు. వైరస్ ఉద్ధృతి, అరికట్టే చర్యలపై.. ఆయా రాష్ట్రాల మంత్రులతో చర్చిస్తారని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆరోగ్య శాఖ భేటీలో.. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని సమీక్షిస్తారు కేంద్ర మంత్రి. దేశంలో..రోజువారీ కేసుల వృద్ధిలో 82శాతం కేసులు ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.