తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'టీకాపై అనుమానాలు పెంచటంలోనే కాంగ్రెస్​ బిజీ' - manmohan letter to modi

టీకా పంపిణీ కన్నా వ్యాక్సిన్​పై అనుమానాలు రేకెత్తించేందుకే కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు మొగ్గుచూపుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆరోపించారు. టీకాలను బహిరంగంగా స్వీకరించేందుకు సిగ్గుపడి కొందరు కాంగ్రెస్ నేతలు రహస్యంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్ రాసిన​ లేఖకు.. హర్షవర్ధన్​ ప్రత్యుత్తరం పంపారు.

VARDHAN
'టీకాలపై అనుమానాలను పెంచటంలోనే కాంగ్రెస్​ బిజీ'

By

Published : Apr 19, 2021, 4:25 PM IST

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కన్నా టీకాపై అనుమానాలు రేకెత్తించేందుకే ఆ పార్టీ ఎక్కువగా కృషి చేస్తోందని కేంద్రమంత్రి హర్షవర్ధన్ విమర్శించారు. వ్యాక్సినేషన్‌ వేగవంతం, టీకా లభ్యతను పెంచడం సహా కరోనా నియంత్రణ కోసం పలు సూచనలు చేస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖపై హర్షవర్ధన్ స్పందించారు.

కొవిడ్ మహమ్మారి కట్టడికి మన్మోహన్ చేసిన సూచనలు అర్ధం చేసుకుంటామన్న హర్షవర్ధన్​.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వీటిని పాటించడం లేదన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు టీకా సమర్థతపై అసత్యాలు వ్యాప్తి చేయడానికి శ్రద్ధ చూపుతున్నాయని ఆరోపించారు. ఓ కాంగ్రెస్ సీఎం టీకాకు వ్యతిరేకంగా ప్రచారం చేసి రికార్డు సృష్టించారని విమర్శించారు.

టీకాలను బహిరంగంగా తీసుకునేందుకు సిగ్గుపడి కొందరు కాంగ్రెస్ నేతలు రహస్యంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు హర్షవర్ధన్​. టీకా తయారీ కోసం విశ్వసనీయ విదేశీ సంస్థలను అనుమతించే అంశంపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:కరోనా పరిస్థితిపై ప్రధాని మోదీ కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details