దేశవ్యాప్తంగా కోరనా వ్యాక్సిన్ పంపిణీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారుల సన్నద్ధతపై శుక్రవారం సాయంత్రం దిల్లీలో సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూంను పరిశీలించారు. టీకా నిర్వహణకు ప్రభుత్వం ఉపయోగించే కొవిన్ యాప్‌పై అధికారులతో చర్చించారు. స్వదేశంలో అభివృద్ధి చేసిన ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనెకా- కొవిషీల్డ్, బారత్బయోటెక్-కొవాగ్జిన్ టీకాలు 100శాతం సురక్షితమైనవి హర్షవర్ధన్ మరోసారి స్పష్టం చేశారు.
'టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి' - Harsh Vardhan reviews COVID-19 vaccination preparedness
కోరనా టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పాట్లపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్. నిర్మాణ్ భవన్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూంను పరిశీలించారు. కరోనా అంతానికి శనివారమే ఆరంభమని మరో కార్యక్రమంలో అన్నారు. టీకా తీసుకున్నాక కూడా ప్రజలు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని ఆరోగ్యమంత్రి స్పష్టం చేశారు.

'టీకా తీసుకున్నా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి'
భారత వాతావరణ శాఖ 146వ వ్యవస్థాపక దినోత్సవంలోనూ ఆరోగ్యమంత్రి పాల్గొన్నారు. కరోనా మహమ్మారి అంతానికి వాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమని చెప్పారు. టీకాలు తీసుకున్న తర్వాత కూడా ప్రజలు కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి: 'స్పుత్నిక్-వీ' మూడో దశ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి