స్థానికంగా లభ్యమయ్యే పోషక ఆహారాలు, పండ్లు, కూరగాయలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్.. 'ఆహార్ క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ దేశాలతో పాటు భారత్లో ఉన్న ఆకలి, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.
"కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో మంచి ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. గతంలో కన్నా.. ఇలాంటి సమయంలో పోషకాహారాలపై అవగాహన కల్పించడం మరింత అవసరం."
-హర్షవర్ధన్, కేంద్ర మంత్రి
స్థానికంగా లభ్యమయ్యే కూరగాయలు, పండ్లలో పోషకాల సమతౌల్యత ఎలా ఉందనే విషయంపై 'ఆహార్ క్రాంతి' దృష్టి సారిస్తుందని తెలిపారు మంత్రి హర్షవర్ధన్.
విజ్ఞాన భారతి(విభా), విజ్ఞాన్ ప్రసార్, గ్లోబల్ ఇండియన్ సైంటిస్ట్ అండ్ టెక్నోక్రాట్స్ ఫోరం, ప్రవాసి భారతీయ అకాడమిక్ అండ్ సైంటిఫిక్ సంపర్క్(ప్రభాస్) సంస్థలు సంయుక్తంగా ఈ 'ఆహార్ క్రాంతి' మిషన్ను చేపట్టాయి. 'ఉత్తమ ఆహారం- ఉత్తమ విజ్ఞానం' అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి.
ఇదీ చదవండి:గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!