అఖండ భారత ఐక్యతా హారతిగా.. భారత మాత మందిరం 1947వ సంవత్సరం. ఆగస్టు 15 వ తేదీ. దేశానికి స్వాతంత్ర్యం లభించిన రోజు. దేశమాత దాస్య శృంఖలాలు వీడిన రోజు. దేశం స్వాతంత్ర్య సాధించి 75 ఏళ్లు. ఈ శుభ సందర్భంలో ఈ వజ్రోత్సవ సంవత్సరాన్ని కేంద్రం 'ఆజాదీ కా అమృత మహోత్సవ్ ' పేరుతో నిర్వహిస్తోంది. వీరులెందరో త్యాగాలు చేశారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన యోధులు, చరిత్రకెక్కని వీరులు... వీరి స్ఫూర్తిని జ్ఞాపకం చేసుకోవటమే కార్యక్రమ ఉద్దేశం. మరోవైపు భారత మాత మందిరం లాంటి స్మృతి చిహ్నాలు స్వాతంత్ర్యోద్యమానికి ముఖ్య కేంద్రాలుగా భాసించాయి.
ఇది ఆలయమే కానీ, ఇందులో ప్రవేశించగానే భరతమాత విగ్రహం లేదా, చిత్రపటం ఏవీ కనపడవు. కానీ చలువరాతిమీద చెక్కిన అఖండ భారత చిత్రపటాన్ని చూడవచ్చు. 1917నాటి అవిభక్త భారతదేశ 3D చిత్రపటం. ఇందులో కజకిస్థాన్, ఆప్ఘనిస్తాన్, పాకిస్థాన్ ల చిత్రపటాలూ ఉన్నాయి. బెనారస్ నగరంలో ఈ మందిరం నాటి నిర్మాణ కౌశలానికి నిదర్శనం. ఎర్రచలువరాయి, మక్రానా మార్బుల్, ఇతర సామగ్రిని నిర్మాణంలో ఉపయోగించారు. జాతీయవాది బాబూ శివప్రసాద్ గుప్త 1917లో మహాత్మాగాంధీ అనుమతితో భారతమాత మందిర నిర్మాణం చేపట్టారు.
-రాజుసింగ్, నిర్వాహకుడు, భారత్ మందిర్
1924లో నిర్మాణం పూర్తయ్యింది. కానీ ప్రారంభించేందుకు వలసప్రభుత్వం అంగీకరించలేదు. స్వరాజ్యపోరాటవ్యాప్తి ఉధృతమవుతుందని బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది.1936 అక్టోబర్ 1వ తేదీన గాంధీజి భారతమాత మందిరాన్ని ప్రారంభించారు.
మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠ్ ప్రాంగణానికి సమీపాన ఉన్న ఈ ఆలయం ఓ దేశభక్తనిలయం. దేశభక్తులు, జాతీయ వాదులు ఇక్కడకలిసేవారు. పర్యాటకులూ సందర్శిస్తుంటారు. స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలతో కూడిన చిత్రాలను ఈ మందిరంలో ఉంచారు. చూడవచ్చు. మహాత్మా గాంధీ, విప్లవయోధులు, అలనాడు సందర్శించిన ప్రముఖుల చిత్రాలు భరతమాత ఆలయంలో కొలువుదీరాయి. స్వరాజ్య సమరంలో పాల్గొనే వేళ యోధులకు చదువుకోవటమూ కష్టంగా ఉండేది. డు ఆలయ నిర్మాత బాబు శివప్రసాద్ గుప్త వారిని ఇక్కడ చదువుకోవటానికి పేద, ధనిక తారతమ్యం లేకుండా అనుమతించారు.
- రాజుసింగ్, నిర్వాహకుడు, భారత్ మందిర్
ప్రపంచంలో అవిభక్త భారత్ ను ఆరాధించే ఏకైక ఆలయం. స్వరాజ్య సమరంలో కాశీలోని భారతమాత ఆలయం కూడా ముఖ్యపాత్ర పోషించింది. ఉద్యమంలో పాల్గొనే వారంతా ఈ ఆలయంలో సమావేశమయ్యేవారు. ఆలయాన్ని నిర్మించిందెవరంటే.. ఒక జాతీయవాది. ధనిక కుటుంబం నుంచి వచ్చిన బాబు శివప్రసాద్ గుప్త. అద్భుత ఆలోచన వచ్చిందే తడవుగా ఒక నమూనా గీసి మహాత్మాగాంధీకి చూపించి ఆయన ఆమోదం పొందారు. మహాత్ముడు ఆమోదించిన పన్నెండేళ్లకి భరత మాత ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. దేశంలో పుట్టిన పౌరులుగా భరతమాతకు కృతజ్ఞతాభావం, జాతీయతా భావం పెంపొందించడానికి ఆలయం నిర్మించారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ' పేరుతో..స్వాతంత్ర్య వజ్రోత్సవ సంవత్సరంలో ఈ స్ఫూర్తి మందిరాన్ని తల్చుకునే అవకాశం వచ్చింది.
ఇదీ చూడండి:Azadi ka Amrut Mahotsav: జాతీయోద్యమానికి వేదికలైన దుర్గామాత ఉత్సవాలు