దీదీకి 51,000 రామ నామాలతో చిత్రం బహుకరణ వారణాసికి చెందిన రామ భక్తురాలు బంగాల్ సీఎం మమతా బెనర్జీకి 51,000 రామ నామాలతో తయారుచేసిన అరుదైన చిత్రాన్ని కానుకగా పంపింది.
వ్యతిరేకత బాధించినందుకే..
యూపీ వారణాసికి చెందిన షాలినీ మిశ్రా రామభక్తురాలు. రాముని చిత్రాలను వేసే అలవాటు ఉంది. లాక్ డౌన్లో ఇంటికే పరిమితమైన షాలినీ.. ఏదైనా విభిన్నంగా ప్రయత్నించాలని నిశ్చయించుకుంది. రామ నామాలతోనే చిత్రాలను గీసే నేర్పును సాధించింది.
దీదీకి 51,000 రామ నామాలతో చిత్రం బహుకరణ ఇటీవల బంగాల్ ఎన్నికల ప్రచారంలో జైశ్రీరాం నినాదం వివాదాస్పదం కావడాన్ని చూసింది. నెల రోజులు శ్రమించి 51,000 రామనామాలతో.. రామ దర్బార్ చిత్రాన్ని గీసింది. అందులో రామ, సీత, భరత, లక్ష్మణ, శతృఘ్నలతో పాటు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్, హనుమాన్, గణేషుని రూపాలు ఉన్నాయి.
మమతా బెనర్జీకి చిత్రాన్ని పంపినట్లు రశీదు రామనామంతో సమస్యేమి?
తాను తయారుచేసిన రామ దర్బార్ చిత్రాన్ని మహిళా దినోత్సవం సందర్భంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీకి స్పీడ్ పోస్ట్‌లో పంపించింది షాలినీ. దానితో పాటు లేఖను జతచేసింది. "దీదీ... రామనామంతో సమస్య ఏంటో చెప్పండి. రామ నామమంటే నమ్మకం. ఆ నామాన్ని స్మరించటం రాజకీయం కాదు. భాజపా, తృణమూల్ వంటి రాయకీయ పార్టీలకే గాక ప్రపంచం మొత్తానికి రామ నామం అదర్శం" అని లేఖలో పేర్కొంది షాలినీ. రామ నామానికి మమత దూరంగా ఉండటం తనను బాధించినట్లు పేర్కొంది. అందుకే బంగాల్ సీఎంకు ఈ చిత్రాన్ని పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:అందుకే నందిగ్రామ్ నుంచి పోటీ: మమత