తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త వందేభారత్ రైళ్లలో విమానం తరహా ఫీచర్​.. బ్లాక్​బాక్స్​ సహా ఇంకెన్నో.. - వందేభారత్ ఇంజిన్ బ్లాక్ బాక్స్

Vande Bharat Special Features : పెరుగుతున్న సాంకేతికతను వందేభారత్​ రైళ్లలో జోడించి ప్రమాదాలను తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ భావిస్తోంది. ఇందుకోసం ముందుగా రైళ్లలో... విమానంలో అమర్చే బ్లాక్​ బాక్స్​లను ఉపయోగిచేలా కొత్త కోచ్​లను బంగాల్​లోని చిత్తిరంజన్ లోకోమోటివ్​ ఫ్యాక్టరీలో తయారుచేస్తోంది.

Vande Bharat Special Features
Vande Bharat Special Features

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 1:52 PM IST

Updated : Aug 25, 2023, 9:04 AM IST

Vande Bharat Special Features :ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని రైలు ప్రయాణికులకు మరింత భద్రతను కల్పించే ఉద్దేశంతో భారత రైల్వే శాఖ ముందుకు కదులుతోంది. ఇందుకోసంకొత్తగా తయారు చేసే వందే భారత్ రైళ్లలో.. విమానంలో ఉండే బ్లాక్​బాక్స్​ను అమర్చుతున్నారు. బంగాల్​లోని చిత్తరంజన్​ లోకోమోటివ్​ కోచ్​ ఫ్యాక్టరీలో మొదటిసారిగా ఈ తరహా ఇంజిన్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం నాలుగు వందేభారత్ రైలు ఇంజిన్లను తయారుచేస్తున్నారు.

Vande Bharat Train Black Box :సెప్టెంబర్​లో ఇంజిన్లను తయారుచేసిన తరవాత, వాటిని చెన్నైలోని ఇంటెగ్రల్​ కోచ్​ ఫ్యాక్టరీలో(ఐసీఎఫ్​) పరీక్షిస్తారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో వందేభారత్​ రైళ్లు నడుస్తున్నాయి. కొత్త వందే భారత్​లో సీసీఆర్​వీసీ అనే విమానంలోని బ్లాక్​బాక్స్ తరహా సాంకేతికత ఉండనుంది. ఇది పైలట్​ అన్ని కదలికలను గమనిస్తుంది. వాటిని ఆడియో, వీడియో రూపంలో భద్రపరుస్తుంది. రైలు ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ బ్లాక్​బాక్స్​లోని సమాచారం ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తారు.

"గతంలో భారతీయ రైల్వే తయారు చేసిన WAP-5 కోచ్​లు హై స్పీడ్​ ఎలక్ట్రిక్​ కోచ్​లు. ఇప్పుడు వీటికి కొత్త రూపం ఇస్తున్నాం. ఇది ఏరో డైనమిక్ ఇంజిన్. రైలు ముందు భాగం 20 డిగ్రీలుగా ఉండేది, ప్రస్తుతం దాన్ని 45 డిగ్రీలు ఉండేలా తయారు చేశాం. దీని వల్ల ఇంజిన్​లో గాలి నిరోధకత తగ్గి, రైలు శక్తి, వేగం పెరుగుతుంది. కొత్త డిజైన్​లో రైలు ముందు భాగంలో ఉండే గ్లాస్​ను పెద్దదిగా ఉండేలా తయారు చేశాం. దీంతో డ్రైవర్ ప్రతిదీ మరింత స్పష్టంగా చూడగలడు."
-దేబీ ప్రసాద్, చిత్తరంజన్​ లోకోమోటివ్​ కోచ్​ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్

కొత్తగా వచ్చే వందేభారత్​ రైలులోని ప్రత్యేకతలు...

  • రైలుకు ముందు, వెనక రెండు ఇంజిన్లు ఉంటాయి. ఇవి ముందుకు, వెనక్కు ప్రయాణించేందుకు వీలుగా ఉంటాయి. రెండు ఇంజిన్లను ఒక పైలట్​ మాత్రమే నియంత్రించగలిగే విధంగా సాంకేతికతను జోడిస్తున్నారు.
  • 24 ప్యాసింజర్​ కోచ్​లను లాగగలిగే సామర్థ్యం ఈ ఇంజిన్లకు ఉంటుంది.
  • ప్రయాణికుల భద్రత కోసం డిస్క్​ బ్రేక్​లను ఏర్పాటు చేస్తున్నారు.
  • ఒకే ట్రాక్​పై రెండు రైళ్లు ప్రయాణిస్తే ఆటోమేటిక్​గా రైలు ఆగిపోతుంది.
  • ఆధునిక సాంకేతికతతో కూడిన ఎయిర్ కండిషన్ డ్రైవర్ క్యాబిన్​.
  • కొత్త వందే భారత్​ ఇంజిన్​లను ఆ కోచ్​ను పోలి ఉండేలా వివిధ రంగులలో తయారుచేస్తున్నారు.

రైళ్లపై రాళ్లు విసురుతున్నారా.. అమ్మో ఇంత పెద్ద శిక్ష విధిస్తారా..!

ఆ సదుపాయాలు మెరుగైతే 'వందే భారత్​' మరింత వేగంగా..

Last Updated : Aug 25, 2023, 9:04 AM IST

ABOUT THE AUTHOR

...view details