తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జింకను ఢీకొట్టిన వందే భారత్​ రైలు.. జంతువు మీద పడి వ్యక్తి మృతి - Alwar Vande Bharat Train Accident

వేగంగా వెళ్తున్న ఓ వందే భారత్​ ఎక్స్​ప్రెస్.. పట్టాలపైన ఉన్న ఓ నీలగై జింకను ఢీ కొట్టింది. దీంతో అది ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతో పాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

Man Died On Spot In Rajasthan Due To Vande Bharat Express
రాజస్థాన్​లో వందే భారత్​ రైలు ఢీ కొనడంతో రైల్వే ఉద్యోగితో పాటు జింక మృతి

By

Published : Apr 19, 2023, 10:13 PM IST

వేగంగా వెళ్తున్న ఓ వందే భారత్​ ఎక్స్​ప్రెస్ రైలు.. పట్టాలపైన ఉన్న ఓ నీలగై జింకను ఢీ కొట్టింది. దీంతో అది ఎగిరి సమీపంలో ఉన్న ఓ వ్యక్తిపై పడింది. ఈ ఘటనలో జింకతో పాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాజస్థాన్​.. అల్వార్​లోని కలి మోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద జరిగింది.

గ్రామస్థులు ఒక్కసారిగా ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శివదయాల్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే రైలును కొద్దిసేపు నిలిపివేశారు డ్రైవర్​. కాగా.. ప్రమాదానికి కారణమైన వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ దిల్లీ నుంచి రాజస్థాన్​లోని అజ్మీర్​కు వెళ్తోంది.

జింక మీద పడి మరణించిన వ్యక్తిని రైల్వే విశ్రాంత ఉద్యోగి శివదయాళ్​గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో జింకతో పాటు శివదయాళ్​ కూడా అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. శివదయాల్​ మృతి చెందిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షలు అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిద్దరూ ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. శివదయాల్ రైల్వే శాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు.

మహిళ మృతి..
గతేడాది నవంబరులో.. గుజరాత్​లోని ఆనంద్​ ప్రాంతంలో ఓ దుర్ఘటన జరిగింది. ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలు అహ్మదాబాద్​కు చెందిన బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్​గా గుర్తించారు. ఈ పూర్తి వార్త ఇక్కడ క్లిక్ చెయ్యండి.

10 అంతస్తుల బిల్డింగ్​ నుంచి నవజాత శిశువు హత్య..!
గుజరాత్​లోని​ అహ్మదాబాద్‌లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. 10 అంతస్తుల భవనంపై నుంచి ఓ నవజాత శిశువును కిందకు పడేశాడు ఓ గుర్తుతెలియని వ్యక్తి. దీంతో రోజులు నిండని ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చంద్‌ఖేడా ప్రాంతంలోని స్కై వాక్ అపార్ట్‌మెంట్‌లో జరిగిందీ ఘటన. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని ఏసీపీ డీవీ రాణా తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details