తెలంగాణ

telangana

ETV Bharat / bharat

1999 పేజీలు.. 8 కేజీలు.. 111 పెన్నులతో భారీ ప్రేమలేఖ రాసిన 'వరల్డ్ ఫేమస్ లవర్​' - భార్యకు భారీ ప్రేమలేఖ

వాలంటైన్స్​ డేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. చాలామంది తమ ప్రేమను లేఖలతో వ్యక్తం చేస్తుంటారు. ఉత్తర్​ప్రదేశ్​ మేరఠ్​ జిల్లాకు చెందిన 63 ఏళ్ల జీవన్ సింగ్ బిష్ట్​ అనే వ్యక్తి మాత్రం.. సాధారణ ప్రేమలేఖలకు భిన్నంగా 1999 పేజీల భారీ లవ్​లెటర్​ను రాశారు. ఆ కథేంటో తెలుసుకుందాం

A huge love letter with 1999 pages
1999 పేజీల భారీ ప్రేమలేఖ

By

Published : Feb 14, 2023, 4:08 PM IST

Updated : Feb 14, 2023, 6:45 PM IST

1999 పేజీలు.. 8 కేజీలు.. 111 పెన్నులతో భారీ ప్రేమలేఖ రాసిన 'వరల్డ్ ఫేమస్ లవర్​'

ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ప్రేమ లేఖలు రాయడం అనేది సాధారణమైన విషయం. అయితే ఓ వ్యక్తి రాసిన లవ్​లెటర్​ మాత్రం ఎన్నో విశేషాలను కలిగి ఉంది. జీవన్ సింగ్ బిష్ట్​ అనే వ్యక్తి తన ప్రేయసికి ఏకంగా 1999 పేజీల ప్రేమ లేఖను రాశారు. 3 నెలల 3రోజుల సమయం తీసుకొని, 111 పెన్నులతో 8 కిలోల బరువు ఉండే భారీ ప్రేమలేఖను రాశారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ఈ ప్రేమలేఖను జీవన్ ఎవరికి రాశారో.. ఆమెనే పెళ్లి చేసుకున్నారు. ఇంత స్పెషల్ ప్రేమలేఖ గురించి మరింత తెలుసుకుందాం పదండి.

ఉత్తరాఖండ్​ అల్మోఢా జిల్లాలోని చాపఢ్​ గ్రామానికి చెందిన జీవన్ సింగ్ బిష్ట్..​ అదే గ్రామానికి చెందిన కమలను చూసి చిన్నతనంలోనే మనసు పారేసుకున్నారు. అనంతరం ఇద్దరి మధ్య సానిహిత్యం పెరిగి.. కొంతకాలం ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత జీవన్​కు ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్​ జిల్లాలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం వచ్చింది. దీంతో తన కుటుంబాన్ని అక్కడికి మార్చాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

1999 పేజీల భారీ ప్రేమలేఖ

కానీ కొన్ని రోజుల తర్వాత 1999లో కుటుంబ పరిస్థితుల వల్ల కమల.. పిల్లలతో కలిసి తిరిగి గ్రామానికి వెళ్లారు. ఒంటరిగా ఉన్న తాను.. తన భార్య మీద ఉన్న ప్రేమను తెలిపేలా ప్రత్యేకమైన ప్రేమలేఖ రాయాలని అనుకున్నాని చెప్పారు జీవన్​ సింగ్​. అలా ఉద్యోగంలో ఉండగానే ఆయన ప్రేమలేఖను రాయడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి రావడం.. సాయంత్రం ఇంటికి వచ్చాక పనులు చూసుకొని, ప్రేమలేఖ రాయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రేమలేఖ రాయడానికి వారం రోజులు సెలవు కూడా తీసుకున్నారు.అలా తాను చెప్పాలనుకున్న మాటలు, వ్యక్తపరచాలని అనుకున్న భావాలకు అక్షర రూపం ఇస్తూ వచ్చారు.

1999 పేజీల భారీ ప్రేమలేఖ

10 లక్షల పదాలతో ప్రేమలేఖ
ప్రేమలేఖ రాయడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా వదల్లేదు జీవన్ సింగ్. పగలు, రాత్రి తేడా లేకుండా 111 పెన్నులు ఉపయోగించి ఈ ప్రేమలేఖను రాశారు. ఇలా తాను అనుకున్నట్లుగా ప్రేమలేఖ రాయడానికి జీవన్ సింగ్​కు ఏకంగా 3 నెలల 3 రోజుల సమయం పట్టింది. ప్రేమలేఖలోని ఒక్కో పేజీలో సగటున 3200 పదాలు రాగా, ఈ ప్రేమలేఖలో మొత్తం 10 లక్షలకు పైగా పదాలు ఉన్నాయి. ఈ భారీ ప్రేమలేఖను చాపఢ్​లో ఉన్న తన భార్యకు పోస్ట్ ద్వారా పంపించారు జీవన్​ సింగ్​. అప్పట్లో ఈ ప్రేమలేఖ డెలివరీ చేయడానికి రూ.700 ఖర్చు అయినట్లు వివరించారు. ఈ ప్రేమలేఖను అందుకున్న కమల చాలా సంతోషించిందని.. తిరిగి తనకు కూడా లేఖ పంపినట్లు జీవన్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు భార్యకు గానీ, ప్రియురాలికి గానీ ఇంత ప్రత్యేకమైన ప్రేమలేఖను ఎవరూ రాయలేదన్న జీవన్ సింగ్.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రేమలేఖ అని చెప్పారు.

1999 పేజీల భారీ ప్రేమలేఖ

ప్రేమలేఖలో ప్రపంచ విషయాలు
జీవన్ సింగ్ తన భార్యకు రాసిన భారీ ప్రేమలేఖలో.. అనేక దేశాల విశేషాలను పొందుపర్చారు. ప్రపంచంలోని వివిధ ప్రదేశాలు, వ్యక్తులతో పాటు దేశంలో జరుగుతున్న పలు ఘటనల గురించి కూడా ప్రస్తావించారు. ఈ ప్రేమలేఖ రాసే సమయంలో భారత్​లో జరిగిన మూడు పెద్ద సంఘటనలను కూడా ప్రస్తావించానని చెప్పారు. భారతదేశంలోని 25 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల గురించి కూడా రాశారు. అంతేకాకుండా ప్రపంచంలోని 210 దేశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ ప్రేమలేఖలో రాశారు.

1999 పేజీల భారీ ప్రేమలేఖ

ఏళ్లు గడిచినా అదే ప్రేమ
పరిస్థితుల కారణంగా జీవన్ సింగ్ తన భార్య కమలకు దూరంగా ఉన్నా.. వారి మధ్య ప్రేమ మాత్రం అలానే ఉంది. మేరఠ్​లో ఉంటున్న తనను కలవడానికి అప్పుడప్పుడు తన భార్య కమల గ్రామం నుంచి వస్తుండేదని జీవన్ సింగ్ తెలిపారు. తనకు నేరుగా చెప్పలేకపోయిన మాటలను తెలుపడానికే లేఖ రాసినట్లు వివరించారు. కాగా ఈ ప్రేమలేఖతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్​లో తన పేరును నమోదు చేసుకునేందుకు జీవన్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.

1999 పేజీల భారీ ప్రేమలేఖ
Last Updated : Feb 14, 2023, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details