Youth bags World Book of Records: ఉత్తరాఖండ్ హల్ద్వానికి చెందిన వైభవ్ పాండే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలను.. ఒకే రోజులో ఎనిమిది కేంద్రాల్లో వందల మందికి తెలిసేలా ప్రచారం చేశాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు చూసి ముగ్ధుడైన వైభవ్ పాండే.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 65 కార్యక్రమాలపై అధ్యయనం చేశాడు. వీటితో పొందే లబ్ధిని సామాన్య ప్రజలకు వివరించాలని నిర్ణయించాడు.
'ప్రభుత్వ' కార్యక్రమాలపై ప్రచారం.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్
Youth bags World Book of Records: ఉత్తరాఖండ్ హల్ద్వానికి చెందిన వైభవ్ పాండే అరుదైన ఘనత సాధించాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 65 కార్యక్రమాలను ఒకే రోజులో వందల మంది తెలిసేలా ప్రచారం చేసి.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో స్థానం సంపాదించాడు.
vaibhav pandey Haldwani
ఆరు ప్రైవేట్ పాఠశాలలతో సహా ఎనిమిది కేంద్రాల్లో ప్రచారం నిర్వహించాడు వైభవ్ పాండే. అతడు ప్రచారం చేసిన 65 కార్యక్రమాల్లో పరీక్షా పే చర్చా, మన్ కీ బాత్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా ఉన్నాయి. డ్రైవర్లు, పాఠశాల ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలకు కూడా ఈ కార్యక్రమాల ద్వారా పొందే లబ్ధిని వివరించాడు. దీంతో పాటు వోకల్ ఫర్ లోకల్ స్ఫూర్తితో నగర ప్రజల కోసం వర్చువల్ సెషన్‌ను నిర్వహించాడు.
ఇదీ చదవండి:గుజరాత్లో రూ.280 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత