తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలకు కొవిడ్​ టీకాపై ఎన్ఐవీ కీలక ప్రకటన - ఎన్​ఐవీ తాజా వార్తలు

సెప్టెంబరు నాటికి పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ(పుణె) డైరెక్టర్​ ప్రియా అబ్రహం తెలిపారు. పిల్లలకు టీకాకు సంబంధించి ఇప్పటివరకు నిర్వహించిన క్లినికల్​ ట్రయల్స్​ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పారు.

corona vaccine for children
పిల్లలకు కరోనా టీకా

By

Published : Aug 19, 2021, 5:33 AM IST

వచ్చే సెప్టెంబరు నాటికి చిన్నారులకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (పుణె) డైరెక్టర్‌ ప్రియా అబ్రహం తెలిపారు. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న చిన్నారులపై కొవాగ్జిన్‌ రెండు, మూడు దశల క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమయ్యాయని వివరించారు.

"ఇప్పటివరకు నిర్వహించిన క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. వాటిని త్వరలో అధికారులకు అందజేస్తాం. సెప్టెంబరు నాటికి పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చు."

-ప్రియా అబ్రహం, ఎన్​ఐవీ(పుణె) డైరెక్టర్​

కొవాగ్జిన్‌ టీకాను హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌.. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) సహాయంతో అభివృద్ధి చేసింది. ఈ టీకా అత్యవసర వినియోగం కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) జనవరిలో ఆమోదించింది. ప్రస్తుతం పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వ్యాక్సిన్‌కు ఆమోదం లభిస్తే చిన్నారులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది.

ఇప్పటికే గుజరాత్‌కు చెందిన ఫార్మా దిగ్గజం జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్‌-డి టీకా అత్యవసర వినియోగ అనుమతుల కోసం డీసీజీఐకు దరఖాస్తు చేసుకుంది. ఇది కూడా పిల్లల వ్యాక్సినేషన్‌కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:'పిల్లలకు ఆ టీకాలు అందలేదా?- అది అవాస్తవం'

ఇదీ చూడండి:Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

ABOUT THE AUTHOR

...view details